Last Updated:

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవికి లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు ప్రదానం

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవికి లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు ప్రదానం

Chiranjeevi Received Lifetime Achievement Award: మెగాస్టార్‌ చిరంజీవికి యూకే ప్రభుత్వం లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 19న జరిగే ఈ కార్యక్రమానికి రెండు రోజుల ముందే చిరు లండన్‌ వెళ్లారు. నిన్న జరిగిన ఈ కార్యక్రమంలో యూకే అధికార పార్టీ లేబర్‌ పార్టీ పార్లమెంట్‌ మెంబర్‌ నవేందు మిశ్రా ఘనంగా సత్కరించారు.

సుమారు 40 ఏళ్లకు పైగా తెలుగు సినిమా రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలను గుర్తిస్తూ యూకే పార్లమెంట్‌ చిరుకు ఈ అవార్డు ప్రదానం చేసింది. నిన్న యూకే పార్లమెంట్‌లో ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించి చిరును సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో మెగా అభిమానులంత ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోజన్‌ జోసెఫ్‌, బాబ్‌ బ్లాక్‌ సహా ఇతరు పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: