Last Updated:

TS Police Jobs: పోలీస్ అభ్యర్థులకు శుభవార్త.. డిసెంబర్ 8 నుంచే ఫిజికల్ టెస్టులు

తెలంగాణలో పోలీస్ అభ్యర్థులకు శుభవార్త. పోలీస్‌ నియామక ప్రక్రియలో అత్యంత కీలకమైన దేహదారుఢ్య పరీక్షలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 8 నుంచి ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఫిజికల్‌ మేజర్మెంట్‌ (PMT), ఫిజికల్‌ మెజర్మెంట్‌ టెస్ట్‌ (PET) నిర్వహించనున్నట్లు పోలీస్‌ నియామక మండలి ప్రకటించింది.

TS Police Jobs: పోలీస్ అభ్యర్థులకు శుభవార్త.. డిసెంబర్ 8 నుంచే ఫిజికల్ టెస్టులు

TS Police Jobs: తెలంగాణలో పోలీస్ అభ్యర్థులకు శుభవార్త. పోలీస్‌ నియామక ప్రక్రియలో అత్యంత కీలకమైన దేహదారుఢ్య పరీక్షలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 8 నుంచి ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఫిజికల్‌ మేజర్మెంట్‌ (PMT), ఫిజికల్‌ మెజర్మెంట్‌ టెస్ట్‌ (PET) నిర్వహించనున్నట్లు పోలీస్‌ నియామక మండలి ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది. ఈ ప్రక్రియను 23 నుంచి 25 పనిదినాల్లో పూర్తిచేస్తామని వెల్లడించింది.

దీనికి సంబంధించి నవంబర్ 29 నుంచి డిసెంబర్‌ 3వ తేదీ అర్ధరాత్రి వరకు అధికారిక వెబ్‌సైట్‌లో www.tslprb.in ద్వారా అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ కానట్లయితే అభ్యర్థులు support@tslprb.inకు ఈ-మెయిల్‌ చేయవచ్చని, లేదా 93937 11110, 93910 05006 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొనింది. వివిధ విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు కలిపి పీఎంటీ, పీఈటీల కోసం 2,37,862 మంది అభ్యర్థులు పార్ట్‌-2 దరఖాస్తును అందజేశారు. ఒక అభ్యర్థి రెండు పోస్టులకు దరఖాస్తు చేసినా దేహదారుఢ్య పరీక్ష మాత్రం ఒక్కసారే నిర్వహించనున్నట్టు బోర్డు అధికారులు తెలిపారు.
ఒకసారి తీసిన రీడింగ్‌లు అన్ని విభాగాల్లోని పోస్టులకు వర్తిస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, సిద్దిపేటలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

ఇదీ చదవండి: వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తా- పవన్ కళ్యాణ్ సవాల్

ఇవి కూడా చదవండి: