NEET Test: నీట్ అడ్మిట్ కార్డులు రిలీజ్.. ఇలా డౌన్ లోడ్ చేసుకొండి

Halltickets: దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు గాను నీట్ 2025 సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. నీట్ యూజీ ఎంట్రెన్స్ టెస్ట్ ను మే4న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అందుకు గాను పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది.
నీట్ పరీక్షకు అప్లై చేసిన విద్యార్థులు అఫిషియల్ వెబ్ సైట్ http://neet.nta.nic.in/ ద్వారా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ ముందుగా వెబ్ సైట్ ఓపెన్ చేసి అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను పొందొచ్చు.
విద్యార్థులకు నీట్ అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవడంలో ఎదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే 011- 40759000, 011- 69227700 నంబర్లకు కాల్ చేయవచ్చు. లేదా neetug2025@nta.ac.in కు మెయిల్ చేయవచ్చు.