Last Updated:

NEET PG Counseling: నీట్ పీజీ కౌన్సిలింగ్ .. అభ్యర్దులు గమనించవలసిన విషయాలివే.

నీట్ ద్వారా పీజీ మెడికల్ కోర్సుల్లో అన్ని రాష్ట్రాలు ఒకే సారి కౌన్సిలింగ్ చేయడం లేదు. ఒక్కో చోట ఒక్కో ప్రొసీజర్. మొదట డీమ్డ్ యూనివర్శిటీలకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని నాన్ లోకల్ కోటా సీట్లకు, సెంట్రల్ ఇనిస్టిట్యూట్స్ కు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. మరి దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ అభ్యర్దులకు సూచనలు అందించారు.

NEET PG Counseling: నీట్ పీజీ  కౌన్సిలింగ్ .. అభ్యర్దులు గమనించవలసిన విషయాలివే.

NEET PG Counseling: నీట్ ద్వారా పీజీ మెడికల్ కోర్సుల్లో అన్ని రాష్ట్రాలు ఒకే సారి కౌన్సిలింగ్ చేయడం లేదు. ఒక్కో చోట ఒక్కో ప్రొసీజర్. మొదట డీమ్డ్ యూనివర్శిటీలకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని నాన్ లోకల్ కోటా సీట్లకు, సెంట్రల్ ఇనిస్టిట్యూట్స్ కు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. మరి దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ అభ్యర్దులకు సూచనలు అందించారు.

సీట్లు ఎక్కువే ఉన్నాయి..(NEET PG Counseling)

ఏ రాష్ట్రాలకు. ఏ కాలేజీలకు, ఏ ర్యాంకుకు అప్లై చేయాలనేదానిపై క్లారిటీ ఉండాలి. ఒక రాష్ట్రంలో కౌన్సిలింగ్ పై ఎవరైనా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటే ప్రవేశాలు నిలిచిపోతున్నాయి. అదే సమయంలో మిగిలిన రాష్ట్రాలు కౌన్సిలింగ్ కొనసాగిస్తున్నాయి. గవర్నమెంట్ కాలేజీల్లో ఎనస్తీయాకు 21 వేలు, గైనకాలజీ 8.00, ఆప్తమాలజీ, 10 వేలు, డర్మటాలజీ 3వేలకు, ఆప్తమాలజీ 21 వేల వరకూ వచ్చే అవకాశముంది.ప్రైవేటు కాలేజీల్లో 7 వేలు నుంచి 20 వేల ర్యాంకు వచ్చినా సీట్లు వస్తాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో సీట్లు ఎక్కువగా ఉన్నాయి. డీమ్డ్ యూనివర్విటీలు ఇండియాలో 50 వరకూ ఉన్నాయి. వీటిలో పీజీ సీటు 25 నుంచి 60 లక్షల వరకూ ఉంటుంది. కొన్ని రకాల కోర్సులకు లక్ష ర్యాంకు వచ్చినా సీట్లు వస్తాయి. అందువలన ఆర్దిక స్తోమతు వున్న వాళ్లు జాగ్రత్తగా తమకు నచ్చిన కోర్సులను డీమ్డ్ యూనివర్శిటీల్లో ఎంపిక చేసుకునే అవకాశముంది. అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటా సీట్లకు కూడా అభ్యర్దులు కంగారుపడకుండా జాగ్రత్తగా అన్ని రౌండ్ల కౌన్సిలింగ్ కు వెళ్లి తరువాత కూడా రాకుండా కాలేజీలను సంప్రదించాలి.అలాకాకుండా బ్రోకర్లును సంప్రదిస్తే నష్టపోతారు. మొత్తంమీద గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్శిటీలు ఇలా మూడు రకాల కాలేజీల్లో కోర్సులను తమ ర్యాంకులు, ఆర్దిక పరిస్దితులకు అనుగుణంగా ఎంపిక చేసుకోవాలి. ఈ కౌన్సిలింగ్ కు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా అభ్యర్దులు డాక్టర్ సతీష్ 8886629883 ను  సంప్రదించవచ్చు.