Published On:

Arrest : నీటి పేపర్ లీకేజీ కేసు.. ప్రధాన నిందితుడు సంజీవ్‌ ముఖియా అరెస్టు

Arrest : నీటి పేపర్ లీకేజీ కేసు.. ప్రధాన నిందితుడు సంజీవ్‌ ముఖియా అరెస్టు

Arrest : ‘నీట్ యూజీ–2024’ ప్రవేశ పరీక్ష పేపర్‌ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు సంజీవ్‌ ముఖియాను ఆర్థిక నేర విభాగం బృందం అరెస్టు చేసింది. గురువారం రాత్రి అతడిని బీహార్‌ రాజధాని పట్నాలో అరెస్టు చేసినట్లు ఈవోయూ అధికారి నయ్యర్‌ హుస్సేన్‌ ఖాన్‌ తెలిపారు.

 

ప్రధాన నిందితుడిగా సంజీవ్‌ ముఖియా..
నీట్‌ పేపర్‌ లీకేజీ కేసులో సంజీవ్‌ ముఖియా ప్రధాన నిందితుడు కాగా, దీంతో పేపర్ లీకేజీ అంశం బయటపడింది. వెంటనే అతడు పరారయ్యాడు. సంజీవ్‌ను పట్టుకునేందుకు బీహార్‌ సర్కారు ఇటీవల అతడికి రూ.3 లక్షల నజరానా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అతడు పట్నాలోని ఓ అపార్టుమెంట్‌లో ఉన్నట్లు సమాచారం రావడంతో అధికారులు హుటహుటినా అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు. ముఖియా అరెస్టుతో పేపర్‌ లీకేజీతో సంబంధం ఉన్న మరి కొంతమంది పేర్లు బయట పడే అవకాశం ఉంది.

 

కొన్నేళ్లపాటు జైలుశిక్ష..
బీహార్‌లోని నలందా జిల్లా నాగర్‌సోనాకు చెందిన సంజీవ్‌ మొదట సాబూర్‌ అగ్రికల్చర్‌ కళాశాలలో పనిచేసేవాడు. అక్కడ పేపర్‌ లీక్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2016 సంవత్సరంలో అతడిపై వేటువేశారు. కేసులో కొన్నేళ్లపాటు జైలుశిక్ష కూడా అనుభవించాడు. అనంతరం నలందా కళాశాల నూర్‌సరయ్‌ బ్రాంచీలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా చేరాడు. నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ వ్యవహారంపై మధ్యవర్తులు, విద్యార్థులపాటు 14 మందిని బీహార్‌ పోలీసులు అరెస్టు చేసి విచారించారు. ఈ క్రమంలోనే సంజీవ్‌ ముఖియా పేరు ప్రధానంగా బయటకు వచ్చింది.

 

‘ముఖియా సాల్వర్‌ గ్యాంగ్‌’ముఠా ఏర్పాటు
సంజీవ్‌ కుమారుడు శివ్‌కుమార్‌ కూడా ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు తేలింది. అతడు బీహార్‌ ఉపాధ్యాయ నియామక పరీక్ష పేపర్‌ లీక్‌ కేసులో అరెస్టు అయ్యారు. ప్రస్తుతం జైలులో ఉన్నాడు. వీరు ‘ముఖియా సాల్వర్‌ గ్యాంగ్‌’ పేరుతో ఒక ముఠాను ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి: