Last Updated:

APSSDC: ఏపీలో రేపు భారీ జాబ్ మేళా..!

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 7వ తేదీన మైదుకూరులో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

APSSDC: ఏపీలో రేపు భారీ జాబ్ మేళా..!

APSSDC: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 7వ తేదీన మైదుకూరులో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మొత్తం 13 ప్రముఖ సంస్థల్లో 900 ఖాళీల్లో తీసుకోనున్నారని తెలుస్తుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ధరఖాస్తులు పెట్టుకోవాలిసి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 7న మైదుకూరులో నిర్వహించనున్న అర్హత గల అభ్యర్థులను ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

ఈ జాబ్ మేళా ద్వారా టాటా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అపోలో ఫార్మసీ, షిరిడీ సాయి ఎలక్ట్రానిక్స్, అమర రాజా బ్యాటరీస్, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, LIC సంస్థల్లో దాదాపు 900 వరకు ఖాళీలను భర్తీ చేయనున్నారని ప్రకటించింది.

కావలిసిన అర్హతలు :
టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.ఎంపికైన వారికి నెలకు రూ. 16 వేలు వేతనం చెల్లించనున్నారు. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 7న గవర్నమెంట్ కాలేజ్, పోరుమామిళ్ల రోడ్, మైదుకూరులో నిర్వహించనున్న ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వాలిసి ఉంటుంది.ఎంపికైన అభ్యర్థులు హైద్రాబాద్లో పని చేయాలిసి ఉంటుంది.ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలకు ఈ నెంబర్లకు 9701801902, 7013504977 సంప్రదించాలని ప్రకటనలో స్పష్టం చేశారు.