Last Updated:

Tirumala Srivari Temple: రేపు 11 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత

చంద్ర‌గ్రహణం కారణంగా రేపు ఉద‌యం 8.30 నుండి రాత్రి 7.30 గంట‌ల‌ వరకు 11 గంటల పాటు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. ఈ కార‌ణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేసినందున నేను సిఫార్సు లేఖలు స్వీకరించబడవని ఆలయ అధికారులు తెలిపారు.

Tirumala Srivari Temple: రేపు 11 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత

Tirumala: చంద్ర‌గ్రహణం కారణంగా రేపు ఉద‌యం 8.30 నుండి రాత్రి 7.30 గంట‌ల‌ వరకు 11 గంటల పాటు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. ఈ కార‌ణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేసినందున నేను సిఫార్సు లేఖలు స్వీకరించబడవని ఆలయ అధికారులు తెలిపారు. రేపు మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌గ్రహణం ఉండనుంది. శ్రీవారి 300రూ ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లను టీటీడీ రద్దు చేసింది. రాత్రి 7.30 గంట‌లకు తర్వాత ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేసిన అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

ఈ గ్రహణం భరణి నక్షత్రం మేషరాశిలో పట్టడం వల్ల అశ్విని, భరణి, కృత్తిక నక్షత్ర జాతకులు, మేష రాశివారు ఈ గ్రహణం చూడరాదు. విడుపు సమయంలో 51 నిముషాలు మాత్రమే ఈ గ్రహణం కన్పిస్తుంది. జోతిష్య పండితులు ఈ గ్రహణాలను అరిష్టంగా పరిగణిస్తున్నారు. ఈ గ్రహణాలు జీవితం పై తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: