Vastu Tips for Shop: షాప్లో ఈ వాస్తు టిప్స్ పాటిస్తే.. లాభాలే లాభాలు

Amazing Vastu Tips for Shop: కొత్త వ్యాపారం లేదా కొత్త దుకాణం ప్రారంభించారా ? చాలా డబ్బు పెట్టుబడి పెట్టి, అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ.. వ్యాపారాన్ని సజావుగా నడపడానికి కస్టమర్ల సంఖ్య పెరగడం లేదా అయితే.. ఇలాంటి పరిస్థితిలో మీరు వాస్తు శాస్త్రం చిట్కాలు పాటించాలి. అవును, వాస్తు శాస్త్రం ఇలాంటి అనేక నియమాలను చెబుతుంది. వీటిని పాటించడం ద్వారా మీరు మీ దుకాణంలో కస్టమర్లను పెంచుకోవచ్చు. దుకాణాన్ని చక్కగా నడపడానికి వాస్తు పరిష్కారాలను తెలుసుకుందాం.
దుకాణంలో లాభాల కోసం వాస్తు టిప్స్:
వాస్తు శాస్త్రం ప్రకారం.. దుకాణంలో శ్రేయస్సు కోసం ప్రతి శుక్రవారం 11 గోమతి చక్రాలను ఎర్రటి వస్త్రంలో కట్టి ప్రధాన ద్వారం వద్ద ఉంచండి. ఈ పరిష్కారం లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకుంటుంది. శుక్రవారం లక్ష్మీదేవి రోజుగా చెబుతారు. కాబట్టి ఈ రోజు ఈ పరిహారం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు దుకాణంపై ఉంటాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం.. దుకాణానికి ఉత్తర దిశలో ఒక గాజు సీసాలో కొద్దిగా పాదరసం ఉంచండి. దీనిని శుభప్రదంగా భావిస్తారు. ఈ పరిష్కారం చేయడం ద్వారా, వ్యాపారం పురోగమించడం ప్రారంభమవుతుంది. అంతే కాకుండా.. కస్టమర్ల సంఖ్య కూడా పెరగడం ప్రారంభమవుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం, వరుసగా 11 రోజులు రాత్రిపూట నీటిలో తామర పువ్వును ఉంచండి. ఇప్పుడు మరుసటి రోజు ఆ నీటిని దుకాణంలోని బ్రహ్మస్థానం వద్ద చల్లుకోండి. నమ్మకాల ప్రకారం.. ఈ పరిష్కారాన్ని అనుసరించడం ద్వారా దుకాణంలో పగటిపూట రెట్టింపు లాభాలు వస్తాయి. అంతే కాకుండా రాత్రిపూట నాలుగు రెట్లు లాభాలు ఉంటాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం.. సాయంత్రం సమయంలో దుకాణంలో దీపం వెలిగించాలి. ఈ పరిష్కారంతో వ్యాపారం బాగా నడుస్తుంది.
దుకాణం తూర్పు వైపున ఏడు గుర్రాలతో ఉన్న సూర్యుని ఫొటో ఉంచడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది వ్యాపారంలో లాభాలను కలిగిస్తుంది. అంతే కాకుండా కస్టమర్లను ఆకర్షిస్తుంది.