Last Updated:

Horoscope: నేటి రాశి ఫలాలు (24 అక్టోబర్ 2022)

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ రోజు అన్ని రాశుల వారికి ఆ లక్ష్మీ దేవి అనుగ్రహం కలిగి అందరూ సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాము. ఈ రోజు అన్ని రాశుల వారికి ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి.

Horoscope: నేటి రాశి ఫలాలు (24 అక్టోబర్ 2022)

1.మేష రాశి

మొండి పట్టుదలను విడనాడండి. అది మీ జీవితానికి కీడు చేస్తుంది. ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఆర్థిక తగాదాలు తలెత్తుతాయి. కాస్త అప్రమత్తంగా వ్యవహరించండి ఉద్యోగస్థులకు నేడు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా జరుగుతాయి.

2 .వృషభ రాశి

శారీరక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మానసిక ధృడత్వం కోసం ధ్యానం యోగా చెయ్యండి. ఈ రోజు మీకు ఆర్థికపరమైన విషయాలు కాస్త అస్తవ్యస్తంగా ఉంటాయి.
రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి అత్యధిక లాభదాయకం. మానసిక ప్రశాంతతను నాశనం చేసే వ్యక్తులకు పనులకు కాస్త దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈరోజు మీ వైహహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

3. మిథున రాశి

మీ తాగుడు అలవాటును మానడానికి ఇవాళే మంచి రోజు. ఈ అలవాటు మానడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. జీవితం ఆనంద మయంగా మారుతుంది.
ఈ రోజు మీకు ఆర్థికపరమైన లాభాలు ఉంటాయి. అనవరమైన ఒత్తిడిని దరిచేరనివ్వకండి. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించండి. వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

4. కర్కాటక రాశి

ఈ రోజు మీరు ఎక్కువగా ఒత్తిడి మరియు అనవసరమైన టెన్షన్ కు లోనవుతారు. వాటి నుంచి మీ కుటుంబ సభ్యులు ఉపశమనం కలిగిస్తారు. ఆర్ధిక లావాదేవీలు కలసివస్తాయి. ఉద్యోగులకు తగిన ప్రశంసలు అందుతాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. కుటుంబ సభ్యులతో గడపడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది.

5. సింహ రాశి

ఈ రోజు ఈ రాశివారికి టెన్షన్ గల వాతావరణం ఉంటుంది. ఏదో జరిగిపోతుందని కంగారు పడకుండా నిదానంగా ప్రశాంతతో ఆలోచించడం వల్ల మంచి ఫలితాలను పొందగలరు. శారీరక ఆరోగ్యం కోసం ధ్యానం , యోగా చెయ్యడం చెప్పదగిన సూచన. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

6. కన్యా రాశి

ఈ రోజు మీరు ఇతరుల కోసం ఎక్కువ డబ్బును ఖర్చు పెట్టడానికి చూస్తారు. మీ జీవితంలో శాంతియుత వాతావరణం కోసం కోపాన్ని విడనాడాలి. ఈ రోజు మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మీరు ఈ రోజు మీకు ధనలాభం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మీ వైవాహిక జీవితం ఈరోజు బాగుంటుంది.

7. తులా రాశి

ఈ రోజు మీకు చాలా ఆనందకరంగా ఉంటుంది. ఆరంభంలో కాస్త ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రోజు గడిచేలోపు లాభాలను చూస్తారు. మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల కనిపిస్తుంది. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానుంది. ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారం బాగా కలిసి వస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఆనంద క్షణాలను గడుపుతారు.

8. వృశ్చిక రాశి

ఈ రోజు మీ దయా స్వభావం మీకు మంచి పేరును లాభాలను తెచ్చిపెడుతుంది. మరియు పర్యావరణానికి సంబంధించి మదుపు చెయ్యడం వల్ల మంచి ఆర్థిక లాభాలను గడిస్తారు. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

9. ధనస్సు రాశి

ఈ రోజు మీ కుటుంబంలోని చిన్నారులు లేదా పెద్దలకు ఆరోగ్యం క్షీణించడం వల్ల అది మీ వైవాహిక జీవితం మీద ప్రభావం చూపుతుంది. మిమ్మల్ని ఆర్థికంగా కాస్త కుంగదీస్తుంది. మానసిక ప్రశాంతత కోసం వ్యాయామం చెయ్యండి. మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా గడుపుతారు.

10. మకర రాశి

మీకు ఏది ఉత్తమైనదో మీకే తెలుసు కాబట్టి దానికే కట్టుబడి ఉండండి. ఈ రోజు మీరు మీ తోబుట్టువులకు కొంత డబ్బు అప్పుగా ఇస్తారు. ఇంట్లో వారి కోరికలను తీర్చడానికి కాస్త డబ్బును ఖర్చు చెయ్యడం మీకు సంతోషాన్నిస్తుంది. మీరు పని చేసే ఆఫీసులో మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ వైహహిక జీవితం ఆనందంగా సాగుతుంది.

11. కుంభ రాశి

ఈ రోజు ఈ రాశి వారు అభద్రత లేదా ఏకాగ్రత అనే భావన లేకపోవడం వల్ల మీరు కాస్త నిర్లక్ష్యంగా బద్ధకంగా ఉంటారు. మీకు ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. ఈ రోజు మీకు ఉద్యోగంలో మంచి ప్రశంసలు లభిస్తాయి. మీ భాగస్వామితో ఈ రోజు ఆనందంగా గడుపుతారు.

12. మీన రాశి

నిద్రావస్థలో ఉన్న సమస్యలు పైకి వచ్చి మిమ్మల్ని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తాయి. ఆర్థిక స్థితిగతులు కాస్త మందకొడిగా ఉంటాయి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ రోజు మీ వైహహిక జీవితం సరదాగా సాగుతుంది.

ఇదీ చదవండి: నరక చతుర్ధశి రోజు చెయ్యకూడని పనులివే..!

ఇవి కూడా చదవండి: