Last Updated:

Bhavyasri Case : ప్రేమ పేరుతో వేధించి, మోసం చేసి.. ఇంటర్ విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్.. కళ్ళు పీకి, గుండు గీసి దారుణ హత్య

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటర్‌ విద్యార్థినిని మరో నలుగురు విద్యార్ధులు ప్రేమ పేరుతో వేధిస్తూ.. చివరికి గ్యాంగ్ రేప్ చేసి.. హత్య చేసిన గహతన స్థానికంగా కలకలం రేపుతుంది. అత్యాచారం అనంతరం బాధిత యువతికి కళ్లు పీకి, గుండు గీసి.. హత్య చేసి బావిలో పడేసినట్లు తెలుస్తుంది.

Bhavyasri Case : ప్రేమ పేరుతో వేధించి, మోసం చేసి.. ఇంటర్ విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్.. కళ్ళు పీకి, గుండు గీసి దారుణ హత్య

Bhavyasri Case : చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటర్‌ విద్యార్థినిని మరో నలుగురు విద్యార్ధులు ప్రేమ పేరుతో వేధిస్తూ.. చివరికి గ్యాంగ్ రేప్ చేసి.. హత్య చేసిన గహతన స్థానికంగా కలకలం రేపుతుంది. అత్యాచారం అనంతరం బాధిత యువతికి కళ్లు పీకి, గుండు గీసి.. హత్య చేసి బావిలో పడేసినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 17 న యువతి అదృశ్యం అవ్వగా..  ఇంటి నుంచి వెళ్లిన మూడు రోజుల తర్వాత గ్రామ సమీపంలోని బావిలో శవమై కనిపించింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  కాగా ప్రస్తుతం మృతురాలికి న్యాయం చేయాలని కోరుతూ సోషల్ మీడియా వ్యాప్తంగా నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పెనుమూరు మండలంలోని కావూరివారిపల్లె పంచాయతీ వేణుగోపాలపురం గ్రామంలో మునికృష్ణ, పద్మావతి దంపతులు నివసిస్తున్నారు. వారి కుమార్తె భవ్యశ్రీ ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతోంది. భవ్యశ్రీని నలుగురు యువకులు ప్రేమపేరుతో వేధించే వారు. ఈనెల 17న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన భవ్యశ్రీ తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి చుట్టుప్రక్కల వెతికారు. బంధువులకు , స్నేహితులకు ఫోన్లు చేసి అడిగి తెలుసుకున్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు పెనుమూరు పోలీసులకు ఆశ్రయించారు.

కాగా సెప్టెంబర్ 20న వేణుగోపాలపురం గ్రామానికి చెందిన కొందరు వినాయక నిమజ్జనం కోసం బావి వద్దకు వెళ్లగా.. మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించగా.. ఆభరణాల ఆధారంగా మునికృష్ణ, పద్మావతి దంపతులు తమ కుమార్తె అని గుర్తించారు. కళ్లు పీకి, జుట్టు కత్తిరించి మృతదేహాన్ని బావిలో పడేశారని తల్లిదండ్రులు అంటున్నారు. అయితే భవ్యశ్రీ కనిపించడం లేదని సెప్టెంబర్ 18న పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు వెంటనే స్పందించి ఉంటే తమ కూతురు బతికే ఉండేదని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే తమ కుమార్తెను కాపాడుకోలేకపోయాని కన్నీరు మున్నీరు అవుతున్నారు.

పోలీసులు ఏమంటున్నారంటే..?  

భవ్యశ్రీ మిస్సింగ్ ఫిర్యాదు అందిన వెంటనే.. దర్యాప్తు మొదలు పెట్టినట్లు చెప్పారు. అనుమానితులను పిలిపించి విచారించామని, వారి కాల్‌ డేటాను చెక్ చేస్తే అనుమానాస్పదంగా ఏమీ లేదని ఎస్సై చెప్పారు. యువతి మృతదేహం నుంచి తీసిన నమూనాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. తాజాగా.. సోమవారం బావిలోని నీటిని మోటారు ద్వారా తోడించగా భవ్యశ్రీ జట్టు లభించిందని ఎస్సై అనిల్‌ కుమార్‌ చెప్పారు. వాటిని సైతం తిరుపతిలోని ఆర్ఎఫ్ఎఫ్ఎస్ ల్యాబ్ కు పంపించామని తెలిపారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా కేసు విచారణ జరుగుతోందని, అయితే.. మూడు, నాలుగు రోజులుగా మృతదేహం నీటిలో ఉండటం వల్ల వెంట్రుకలు విడిపోయే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకూ ఈ కేసులో ఇద్దరు యువకులకు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని అన్నారు. ఆమె, తల్లిదండ్రుల కాల్స్ డేటాను కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. భవ్యశ్రీ మృతిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  అనుమానితులలో ఇద్దరు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

భవ్యశ్రీ తల్లిదండ్రులు ఏం చెబుతున్నారంటే..?

శవ పరీక్ష నివేదికలనూ తారుమారు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని మీడియాతో చెప్పారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. తనకు ఈత కూడా వచ్చని వ్యాఖ్యానించారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయం మరేవరికి జరగకూడదనీ, దోషులకు కఠినంగా శిక్షించాలని మ‌ృతురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. భవ్యశ్రీ కనిపించడం లేదని సెప్టెంబర్ 18న పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు వెంటనే స్పందించి ఉంటే తమ కూతురు బతికే ఉండేదని యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే తమ కుమార్తెను కాపాడుకోలేకపోయాని కన్నీరు మున్నీరు అవుతున్నారు.

ఇవి కూడా చదవండి: