Home / బిజినెస్
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన ట్రేడింగ్ రోజంతా ఓ పరిమిత శ్రేణిలో ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు రానుండటంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు.
ట్విటర్లో వెరిఫైడ్ అకౌంట్ లకు ఇచ్చే బ్లూ టిక్ ను సాధారణ యూజర్లకు కూడా అందుబాటులో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం సబ్స్క్రిప్షన్ తీసుకుని యూజర్లు తమ వెరిఫికేషన్ పొందొచ్చు.
దేశంలో గడిచిన కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్న తరుణంలో తాజాగా బంగారం ధర కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తుంది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతుండగా.. సోమవారం ( జూన్ 12, 2023 ) దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో మార్పులు కనిపించలేదు.
బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. శనివారం భారీగా పెరిగిన బంగారం ధరలో నేడు ( జూన్ 11 , 2023 ) స్వల్ప తగ్గుదల కనిపించింది. ఈ మేరకు తులం బంగారంపై రూ. 100 వరకు తగ్గింది. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 55,000 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,550
టెక్నాలజీకి అనుగుణంగా యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 2023 నుంచి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్న యూజర్లకు గూగుల్ డ్రైవ్ సేవలు నిలిపివేయనున్నట్టు ప్రకటించింది.
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు గమనించవచ్చు. గత కొంత కాలం నుంచి బంగారం ధరలు తగ్గుతున్న విషయం తెలిసిందే. కాగా బంగారం ధర తగ్గిందని సంతోషించే లోపే మళ్లీ పసిడి ధరలు పెరిగి షాక్ ఇచ్చాయి. శుక్రవారం తులం గోల్డ్‌పై ఏకంగా రూ. 400 తగ్గగా మళ్లీ వెంటనే భారీగా పెరిగింది.
కరోనా నేపథ్యంలో ఇప్పటి వరకు ఇంటి నుంచే పని చేసిన ఉద్యోగులను కంపెనీలు కార్యాలయాలకు పిలుపిస్తున్నాయి. పలు టెక్ కంపెనీ ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేశాయి. ఈ క్రమంలో దిగ్గజ కంపెనీ గూగుల్ కూడా వారానికి మూడు రోజులు ఖచ్చితంగా ఆఫీసుకు వచ్చి పని చేయాల్సిందేనని తమ ఉద్యోగులకు తేల్చి చెప్పింది.
యాపిల్ ఎయిర్ ట్యాగ్, శాంసంగ్ స్మార్ట్ ట్యాగ్ మాదిరి రిలయన్స్ జియో నుంచి సరికొత్త పరికరం విడుదల అయింది. ‘జియో ట్యాగ్’ పేరుతో కొత్త బ్లూటూత్ ట్రాకర్ ను తీసుకొచ్చింది. చిన్న చిన్న వస్తువులు.. పర్స్ లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కీస్ లాంటివి..
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయం దగ్గర పడుతోంది. గత ఆర్థిక సంవత్సరానికి గాను పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు గాను ఇప్పటికే రిటర్న్ పత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఆదాయపు పన్ను డిపార్ట్ మెంట్ ఇప్పటి వరకూ ఇచ్చిన సమాచారం ప్రకారం ఆడిట్ అవసరం లేని వారు జులై 31 వరకూ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.
రియల్ మీ నుంచి సరికొత్త సిరీస్ లు దేశీయ మార్కెట్ లో విడుదలయ్యాయి. రియల్ మీ 11 ప్రో 5G, 11 ప్రో+ 5G పేరిట ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. కాగా, మే 10 న చైనా మార్కెట్లోకి విడుదల అయ్యాయి.