Last Updated:

Google: ఆఫీసుకు రావాల్సిందే.. ఉద్యోగులకు తేల్చి చెప్పిన గూగుల్

కరోనా నేపథ్యంలో ఇప్పటి వరకు ఇంటి నుంచే పని చేసిన ఉద్యోగులను కంపెనీలు కార్యాలయాలకు పిలుపిస్తున్నాయి. పలు టెక్ కంపెనీ ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేశాయి. ఈ క్రమంలో దిగ్గజ కంపెనీ గూగుల్ కూడా వారానికి మూడు రోజులు ఖచ్చితంగా ఆఫీసుకు వచ్చి పని చేయాల్సిందేనని తమ ఉద్యోగులకు తేల్చి చెప్పింది.

Google: ఆఫీసుకు రావాల్సిందే.. ఉద్యోగులకు తేల్చి చెప్పిన గూగుల్

Google: కరోనా నేపథ్యంలో ఇప్పటి వరకు ఇంటి నుంచే పని చేసిన ఉద్యోగులను కంపెనీలు కార్యాలయాలకు పిలుపిస్తున్నాయి. పలు టెక్ కంపెనీ ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేశాయి. ఈ క్రమంలో దిగ్గజ కంపెనీ గూగుల్ కూడా వారానికి మూడు రోజులు ఖచ్చితంగా ఆఫీసుకు వచ్చి పని చేయాల్సిందేనని తమ ఉద్యోగులకు తేల్చి చెప్పింది. ఇకపై ఉద్యోగుల పనితీరును అంచనా వేయడానికి హాజరు శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఇంటర్నెల్ గా పంపిన మెయిల్‌లో గూగుల్ పేర్కొంది. అయితే, ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం ’ విధానంపై గూగుల్ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

ఏమాత్రం సరికాదు(Google)

క్లారిటీ లేని హాజరు విధానం ద్వారా తమ పనితీరును అంచనా వేయడం ఏమాత్రం సరికాదని ఆల్ఫాబెట్‌ వర్కర్స్‌ యూనియన్‌లో భాగమైన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తెలిపారు. మే లో జరిగిన గూగుల్‌ I/O వార్షిక సమావేశంలో ఆవిష్కరించిన ప్రొడక్ట్‌లో చాలా వరకు ఒకే దగ్గర కూర్చొని సమన్వయం చేసుకున్న ఉద్యోగులే అభివృద్ధి చేశారని గూగుల్‌ మెయిల్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆఫీసులో కో ఆర్డినేషన్ తో పనిచేయడం వల్ల మంచి ఫలితాలు సాధించ వచ్చని కంపెనీ పేర్కొంది.

 

రిమైండర్లు పంపుతాయ్(Google)

కాబట్టి ఉద్యోగుల పనితీరులో హాజరు శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. కార్యాలయానికి రాని ఉద్యోగులకు వారి టీమ్ లు రిమైండర్లు పంపుతాయని పేర్కొంది. ప్రత్యేక పరిస్థితులు ఉన్న సందర్భాల్లో మాత్రం ఖచ్చితంగా మినహాయింపు ఇస్తామని స్పష్టం చేసింది. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాలని గూగుల్‌ తమ ఉద్యోగులకు వెల్లడించింది. తాజాగా ఈ విధానాన్ని అన్ని విభాగాలకూ విస్తరించింది.