Mukesh Ambani: ముఖేష్ అంబానీ జీతం సున్నా..!
ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేతల్లో ఒకరైన ముఖేష్ అంబానీ పేరు తెలియని వారుండరు. అయితే ఈ ఏడాది ముఖేష్ అంబానీ జీతం సున్నా అని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది.
Mukesh Ambani: ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేతల్లో ఒకరైన ముఖేష్ అంబానీ పేరు తెలియని వారుండరు. ఆయన లగ్జరీ లైఫ్. వ్యాపారాలు మొదలైనవి అన్నీ దేశ ఆర్ధిక వ్యవస్థలో మార్పులు తెస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ ఏడాది ముఖేష్ అంబానీ జీతం సున్నా అని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ముకేష్ అంబానీ వరుసగా రెండవ ఏడాది కూడా తనకు జీతం వద్దని ప్రకటించారు. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్న వేళ. తాను ఈ నిర్ణయం తీసుకోవడం పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది. 2020-21 వేతనాన్ని త్యజించిన ఆయన, 2021-22లోనూ ఇదే విధంగా చేసినట్టు రిలయన్స్ సంస్థ చెప్పుకొచ్చింది. ముకేష్ అంబానీ స్వచ్ఛందంగా వేతనాన్ని వదులుకున్నారని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షిక నివేదికలో తెలిపింది. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా కీలక బాధ్యతలు చేపట్టినప్పటికీ గత రెండు సంవత్సరాలకు సంబంధించిన అలవెన్సులు, సౌకర్యాలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు, కమీషన్ లేదా స్టాక్ అవకాశాలను అంబానీ తీసుకోలేదని వెల్లడించింది.
కాగా 2008-09 సంవత్సరం నాటి నుంచి ముకేష్ అంబానీ రూ.15 కోట్ల వార్షిక వేతనాన్ని తీసుకుంటున్నారని, సౌకర్యాలు, అలవెన్సులు, కమీషన్లతో కలుపుకుని మొత్తం రూ.24 కోట్లకు పైగానే ఆయన అందుకుంటున్నారని రిలయన్స్ సంస్థ పేర్కొనింది.
మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి
మరిన్ని వార్తలు చదవండి : 5G: దీపావళి నాటికి ప్రధాన నగరాల్లో 5G సేవలు.. ముఖేష్ అంబానీ