Last Updated:

Kim Kardashian: అంబానీ ఎవరో నాకు తెలియదు – అయినా పెళ్లికి వెళ్లాం : కిమ్‌ కర్దాషియన్‌

Kim Kardashian: అంబానీ ఎవరో నాకు తెలియదు – అయినా పెళ్లికి వెళ్లాం : కిమ్‌ కర్దాషియన్‌

Kim Kardashian says she Does Not know the Ambanis: ప్రపంచ కుబేరుడు అంబానీ అంటే తెలియని వారుండరు. కానీ ఓ నటి మాత్రం తనకు అంబానీ ఎవరో తెలియదు అని చెప్పి షాకిచ్చింది. ఆయన తెలియకుండానే అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లికి వచ్చామని ఆమె చెప్పింది. ఇంతకి ఆమె ఎవరంటే హాలీవుడ్‌ సెన్సేషన్‌ కిమ్‌ కర్దాషియన్‌.

అంబానీ పెళ్లిలో కిమ్ సిస్టర్స్ సందడి

గతేడాది అంబానీ చిన్న కుమారు అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి అతిరథ మహారథులందరికి ఆహ్వానం అందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అపర కుబేరులు, దిగ్గజ వ్యాపారవేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు, స్టార్‌ సింగర్స్‌ ఇలా ఎంతోమంది ప్రముఖులు హాజరై సందడి చేశారు. అలాగే హాలీవుడ్‌ సెన్సేషన్‌ కర్దాషియన్‌ సిస్టర్స్‌ నటి కిమ్‌ కర్దాషియన్‌తో పాటు ఆమె సో దరి ఖ్లోయె కర్దాషియన్‌ కూడా పాల్గొన్నారు. అంతేకాదు ఈ పెళ్లిలో వారు ఆడి-పాడి సందడి చేశారు. ఈ వేడుకలో వారిద్దరు స్పెషల్‌ అట్రాక్షన్‌ గాను నిలిచారు.

అంబానీ ఎవరో తెలియదు

అయితే తాజాగా ‘ద కర్దాషియన్స్‌’ లేటెస్ట్‌ ఎపిసోడ్స్‌లో కిమ్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఈ షోలో ఆమె మాట్లాడుతూ.. “అంబానీ పెళ్లి గురించి మాట్లాడింది. నిజానిక అంబానీలేవరో నాకు తెలియదు. కానీ మా ఫ్రెండ్‌ లారైన్‌ స్క్వార్ట్జ్‌ కు వారు బాగా పరిచయం. తను ప్రముఖ జ్యువెలరీ డిజైనర్‌. అంబానీ కుటుంబంలోని వారి కోసం ప్రత్యేకంగా ఆభరణాలు డిజైన్‌ చేసి పంపిస్తుంది. ఈ క్రమంలో అంబానీ కుటుంబంతో ఆమె మంచి అనుబంధం ఏర్పడింది. అయితే తాను అంబానీ పెళ్లికి వెళ్తున్నాని, తనకు ఆహ్వానం అందినట్టు చెప్పింది. అలాగే మాకు కూడా వారు ఆహ్వానం ఇవ్వాలని అనుకుంటున్నట్టు తను నాకు చెప్పింది. తను చెప్పగానే ఆహ్వానం అందితే తాను తప్పకుండ ఆ పెళ్లి వస్తానని చెప్పాను” అని పేర్కొంది.

20 కిలోల ఇన్విటేషన్ గిఫ్ట్

అలాగే చెప్పినట్టుగానే తనకు అంబానీ నుంచి ఆహ్వానం అందిందని చెప్పింది. “వారు పెంపిన ఓ పెద్ద ఇన్విటేషన్‌ బాక్స్‌ పింపించారు. అది సుమారు 20 కిలోల బరువు ఉంటుంది. అది ఓపెన్‌ చేసినప్పుడు ఒక రకమైన సంగీతం కూడా వచ్చింది. ఆ ఇన్విటేషన్‌ గిఫ్ట్‌ బాక్స్‌ మాకు చాలా బాగా నచ్చింది. అది చూశాక ఇలాంటి వాటికి నో చెప్పే ప్రసక్తే ఉండదు. కచ్చితంగా ఈ పెళ్లికి వెళాల్సిందే అని నిర్ణయించుకున్నాం. అలా అంబానీలు ఎవరో తెలియకుండానే ఆ పెళ్లికి వెళ్లాం” అని ఆమె చెప్పుకొచ్చింది.