Last Updated:

MRF Share: దలాల్ స్ట్రీట్ లో రికార్డు క్రియేట్ చేసిన ఎంఆర్‌ఎఫ్‌ షేరు

ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్‌ఎఫ్‌ షేరు మంగళవారం హిస్టరీ క్రియేట్ చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో రూ. 1 లక్ష తాకిన మొదటి స్టాక్ గా రికార్డు సృష్టించింది. మంగళవారం దలాల్ స్ట్రీట్ లో ఎంఆర్ఎఫ్ షేరు లక్ష మార్క్ ను దాటింది.

MRF Share: దలాల్ స్ట్రీట్ లో రికార్డు క్రియేట్ చేసిన ఎంఆర్‌ఎఫ్‌ షేరు

MRF Share: ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్‌ఎఫ్‌ షేరు మంగళవారం హిస్టరీ క్రియేట్ చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో రూ. 1 లక్ష తాకిన మొదటి స్టాక్ గా రికార్డు సృష్టించింది. మంగళవారం దలాల్ స్ట్రీట్ లో ఎంఆర్ఎఫ్ షేరు లక్ష మార్క్ ను దాటింది. తర్వాత మధ్యాహ్నం 12.09 గంటల సమయంలో దిగొచ్చి 0.79 లాభంతో రూ. 99,800 దగ్గర ట్రేడ్ అవుతోంది.

 

మే నెలలోనే లక్ష మార్క్ కు

మే నెలలోనే ఎంఆర్‌ఎఫ్‌ షేరు రూ. 1 లక్ష మార్క్ కు దగ్గరగా వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లింది. అయితే, ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో మాత్రం మే 8న ఈ కీలక మైలురాయిని దాటింది. తాజాగా మంగళవారం ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.48 శాతం లాభంతో రూ. 1,00,439.95 దగ్గర ప్రారంభమైంది. బీఎస్‌ఈలో కూడా రూ. 1,00,300 దగ్గర ట్రేడింగ్‌ మొదలుపెట్టింది. గత ఏడాది వ్యవధిలో కంపెనీ షేరు 46 శాతం పుంజుకుంది. మే 8 న ఈ స్టాక్‌ స్పాట్‌ మార్కెట్‌లో రూ. 99,933 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. మెరుగైన త్రైమాసిక, వార్షిక ఫలితాలు స్టాక్‌ ర్యాలీకి ఉపయోగపడ్డాయి.

 

ఎంఆర్‌ఎఫ్‌ లాభం రెండింతలు(MRF Share)

2021 జనవరిలో ఈ కంపెనీ స్టాక్‌ తొలిసారి రూ. 90 వేల మార్క్‌ పైన క్లోజ్ అయింది. అక్కడి నుంచి రూ. లక్ష మార్క్ ను చేరుకోవడానికి దాదాపు రెండున్నరేళ్లు పట్టింది. ఈ షేరు 2012 ఫిబ్రవరిలో తొలిసారి రూ. 10 వేల మార్క్‌ను అందుకుంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఎంఆర్‌ఎఫ్‌ లాభం దాదాపు రెండింతలు పెరిగి రూ. 410.7 కోట్లుగా నమోదైంది. ఆదాయం 10.1 శాతం ఎగబాకి రూ. 5,725. 4 కోట్లుకు చేరింది.

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఎంఆర్‌ఎఫ్‌ కంపెనీ మొత్తం 42,41,143 షేర్లను జారీ చేసింది. వీటిలో 30,60,312 షేర్లు పబ్లిక్‌ షేర్‌హోల్డర్ల చేతిలో ఉన్నాయి. దీంట్లో రిటైల్‌ మదుపర్ల వాటా 12.73 శాతంగా ఉంది. ఇక 11,80,831 షేర్లు ప్రమోటర్ల అధీనంలో ఉన్నాయి.