Last Updated:

Lok Sabha Exit polls-Stock Market: జూన్ 1న వెలువడనున్న లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్.. స్టాక్ మార్కెట్ పై వీటి ప్రభావం ఎలా ఉంటుంది ?

వచ్చే శనివారంతో లోకసభ ఎన్నికలు ముగియబోతున్నాయి. అదే రోజు ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడుతాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎన్ని సీట్లు సాధిస్తుందనే విషయం అదే రోజు దాదాపు తేలిపోతుంది.

Lok Sabha Exit polls-Stock Market: జూన్ 1న వెలువడనున్న  లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్.. స్టాక్ మార్కెట్ పై వీటి ప్రభావం ఎలా ఉంటుంది ?

Lok Sabha Exit polls-Stock Market:వచ్చే శనివారంతో లోకసభ ఎన్నికలు ముగియబోతున్నాయి. అదే రోజు ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడుతాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎన్ని సీట్లు సాధిస్తుందనే విషయం అదే రోజు దాదాపు తేలిపోతుంది. గత పది సంవత్సరాల నుంచి కేంద్రంలో బీజేపీ పాగా వేసి అధికారం చెలాయిస్తోంది. బీజేపీ గెలిచినప్పుడల్లా సెన్సెక్స్‌ తారా జువ్వలా దూసుకుపోతుంది. ఈసారి ప్రధానమంత్రి నుంచి హోంమంత్రి వరకు 4వ తేదీన స్టాక్‌ మార్కెట్లు దూసుకుపోతాయి. ముందుగానే షేర్లు కొనుగోలు చేసి పెట్టుకోండని సలహా ఇచ్చారు. మరి మోదీ, షాలు చెప్పినట్లు మార్కెట్లు అనుకూలంగా స్పందిస్తాయా లేదా అనేది చూద్దాం..

విఐఎక్స్‌ గేజ్‌ 30 పాయింట్లు దాటితే..(Lok Sabha Exit polls-Stock Market)

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్‌ కొనసాగుతోంది. శనివారంతో చివరి అంకం పోలింగ్‌ ముగుస్తుంది. ఇక తేలాల్సింది కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎంత మెజారిటీ సాధిస్తుందనేది వేచి చూడాల్సిందే. అయితే ఈ సారి లోకసభ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరుగుతున్నాయి. ఇప్పటికి ఆరు విడతలు పూర్తి అయ్యాయి. ఇక మిగిలింది ఏడవ విడత పోలింగ్‌. ఈ ఆరు విడతల్లో మార్కెట్లు తీవ్రమైన ఒడిదుడుకుల్లో ట్రేడ్‌ అయ్యాయి. అయితే స్టాక్‌ మార్కెట్‌ గేజ్‌ను కొలిచే ఇండియా విఐఎక్స్‌ మాత్రం 10 నుంచి 21 లెవెల్స్‌లోనే ఈ లోకసభ ఎన్నికల్లో తచ్చాడింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే విఐఎక్స్‌ గేజ్‌ 30 పాయింట్లు దాటిందంటే అత్యంత ప్రమాదకరం. అదే 20లోపు ఉందంటే మార్కెట్‌ స్థిరంగా ఉందని చెప్పుకోవచ్చు. మార్కెట్లకు వచ్చిన ఢోకా లేదని ధైర్యంగా చెప్పుకోవచ్చునని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఈ సారి స్టాక్‌ మార్కెట్లపై ఆసక్తి కలగడానికి ప్రధాన కారణం.. ప్రధానమంత్రి నుంచి హోంమంత్రి వరకు జూన్‌ 4న లోకసభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కేంద్రంలో తామే అధికారంలోకి వస్తున్నాం. స్టాక్‌ మార్కెట్లు తారా జువ్వలా దూసుకుపోతాయి. ధరలు పెరగడానికి ముందే షేర్లు కొనుగోలు చేసుకోండని సలహా ఇచ్చారు. దీంతో చాలా మంది ఫోకస్‌ స్టాక్‌మార్కెట్లపై పడింది. ఏ షేర్లు కొనుగోలు చేయాలా అని బుర్రలు గొక్కుకుంటున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వరంగానికి చెందిన కంపెనీలకు జవసత్వాలు కల్పించింది మాత్రం ఖచ్చితంగా బీజేపీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో పీఎస్‌యు కంపెనీలు దాదాపు ఫేస్‌ వ్యాల్యు కంటే కిందికి దిగివచ్చాయి. గత దశాబ్దకాలంలో పీఎస్‌యు కంపెనీలు లాభాలబాట పట్టడంతో స్టాక్‌ మార్కెట్లో ఈ షేర్లు కళకళ లాడుతున్నాయి కూడా.

కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే..

ఇక జూన్‌ 1 శనివారం సాయంత్రం 7 గంటలకు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వెలువడ్డం మొదలవుతాయి. అయితే స్టాక్‌ మార్కెట్లకు శనివారం, ఆదివారం నాడు సెలవు. ట్రేడింగ్‌ మొదలయ్యేంది మాత్రం జూన్‌ 2 సోమవారం. మన దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారంలో ఐదు రోజులు మాత్రమే ట్రేడ్‌ అవుతాయి. అది సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది. వాటిలో ప్రీ మార్కెట్‌.. పోస్ట్‌ మార్కెట్‌.. స్టాక్‌ ప్రైజ్‌ .. ఇండెక్స్‌ అడ్జెస్ట్‌మెంట్‌ సెషన్స్‌ ఉంటాయి. సాధారణంగా శని, ఆదివారాల్లో స్టాక్‌ మార్కెట్లకు సెలవు. స్టాక్‌ ఎక్సేంజీలో స్పెషల్‌ ట్రేడింగ్‌ సెషన్‌ నిర్వహించాలంటే నిర్వహించుకోవచ్చు. గత శనివారం నాడు అంటే మే 18న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు స్పెషల్‌ ట్రేడింగ్‌ నిర్వహించారు… అది డిజాస్టర్‌ మెకానిజం కోసం. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ తర్వాత అంటే జూన్‌ 3న మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ అనెలిస్టులు అభిప్రాయపడుతున్నారు. దీనికి వారు చెబుతున్న కారణం ఓటింగ్‌ శాతం గణనీయంగా తగ్గడమేనని విశ్లేషిస్తుననారు. స్టాక్‌ మార్కెట్ల విషయానికి వస్తే కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడి.. అధికారంలోకి వచ్చిన సర్కార్‌ యధాతథంగా సంస్కరణలను కొనసాగినంత వరకు స్టాక్‌ మార్కెట్లకు వచ్చిన ఇబ్బంది ఏమీలేదు.

ఏది ఏమైనా బీజేపీ అధికారంలోకి వస్తే స్టాక్‌ మార్కెట్లు పరుగులు తీస్తుంది. ఒక వేళ 400 సీట్ల కంటే తగ్గితే .. మార్కెట్‌ జోరు కాస్తా తగ్గవచ్చు. అయితే దీర్ఘకాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే దేశీయ మార్కెట్లు వచ్చిన ఢోకా మాత్రం లేదు. 2014లో సెన్సెక్స్‌ 25వేల నుంచి 2024 నాటికి 75వేలకు తెచ్చామని ప్రధాని మోదీ ఇటీవలే చెప్పారు. ఇక రాహుల్‌ విషయానికి వస్తే..కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా అదానీ షేర్లు ఎందుకు పెరుగుతున్నాయని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే స్టాక్‌ మార్కెట్ల గురించి వ్యతిరేకంగా మాట్లాడే రాహుల్‌ కూడా తన ఎన్నికల అఫిడవిట్‌లో పెద్ద ఎత్తున షేర్లు కొనుగోలు చేసి లబ్ధి పొందడం గమనార్హం. కాబట్టి ఇప్పట్లో ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లకు వచ్చిన ఇబ్బంది ఏమీలేదు. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్టంగా ఉన్నాయి. త్వరలో ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకోబోతున్నాం. ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో మూడవ స్థానానికి చేరుకోబోతున్నాం. కాబట్టి దేశీయ స్టాక్‌ మార్కెట్లు ముందున్నవి అన్నీ అచ్చేదిన్‌ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నిరభ్యంతరంగా షేర్లు కొనుగోలు చేసుకోవచ్చునని మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: