Last Updated:

Kazan Khan : చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు “కజాన్ ఖాన్” మృతి

చిత్ర పరిశ్రమలో తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో విలన్ గా నటించిన "కజాన్ ఖాన్" మృతి చెందారు. సోమవారం (జూన్ 12) రాత్రి గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కజన్ ఖాన్‌ వయసు ప్రస్తుతం 46 ఏళ్లని తెలుస్తోంది. కాగా ఆయన తెలుగులో చేసింది

Kazan Khan : చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు “కజాన్ ఖాన్” మృతి

Kazan Khan : చిత్ర పరిశ్రమలో తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో విలన్ గా నటించిన “కజాన్ ఖాన్” మృతి చెందారు. సోమవారం (జూన్ 12) రాత్రి గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కజన్ ఖాన్‌ వయసు ప్రస్తుతం 46 ఏళ్లని తెలుస్తోంది. కాగా ఆయన తెలుగులో చేసింది కొన్ని సినిమాలైన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజశేఖర్‌ హీరోగా నటించిన అమ్మ కొడుకు సినిమాలో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

ఆ తర్వాత శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం సినిమా లోనూ, మోహన్ బాబు రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో ప్రతి నాయకుడిగా నటించి మంచి ప్రశంసలు అందుకున్నాడు. అయితే తమిళ్‌, మలయాళంలో మాత్రం వరుసగా సినిమాలు చేశాడు. గంధర్వం, సిఐడి మూస, ద కింగ్, వర్ణపకిత్, డ్రీమ్స్, మాయమోహిని, రాజాధి రాజా వంటి మలయాళ సినిమాలతో పాటు తమిళ్‌, కన్నడ, హిందీ భాషల్లోనూ విలన్ పాత్రలు పోషించాడు. 2015లో వచ్చిన లైలా ఓ లైలా అనే మలయాశం మూవీలో ఆఖరి సారిగా కనిపించారు కజన్‌.

కజాన్ ఖాన్ సొంత రాష్ట్రం కేరళ.. అందుకే మలయాళ భాషల్లోనే ఎక్కువగా సినిమాలు చేశాడు. కజన్‌ ఖాన్‌ మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు, సినీ అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.