Last Updated:

Srikakulam: శ్రీకాకుళంలో వైసీపీ నేత దారుణ హత్య

ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న సంఘటనలు లేకపోలేదు. ఆ తగాదాలు కాస్త ముదిరి దాడులకు పాల్పడుతున్న సంఘటనలను చూస్తూనే ఉన్నాం.  ఈ నేపథ్యంలోనే అధికార వైసీపీకి చెందిన నేతను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపేశారు.

Srikakulam: శ్రీకాకుళంలో వైసీపీ నేత దారుణ హత్య

Srikakulam: ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న సంఘటనలు లేకపోలేదు. ఆ తగాదాలు కాస్త ముదిరి దాడులకు పాల్పడుతున్న సంఘటనలను చూస్తూనే ఉన్నాం.  ఈ నేపథ్యంలోనే అధికార వైసీపీకి చెందిన నేతను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ తెల్లవారుజామున ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

శ్రీకాకుళం జిల్లా గార మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రామశేషును దుండగులు కత్తితో అతికిరాతకంగా నరికి చంపారు. శ్రీకూర్మం గ్యాస్ గోడౌన్ సమీపంలో ఈ హత్య జరిగింది. కాగా స్థానికుల మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించగా పక్కనున్న పొలాల్లో హత్యకు వాడిన కత్తి లభించింది.

రామశేషు ఒంటిపై ఉన్న బంగారం, సెల్ ఫోన్ అలాగే ఉండడం వల్ల ఇది దొంగల పని కాదని పోలీసులు భావిస్తున్నారు. రియలెస్టేట్ వ్యవహారాలు, వివాహేతర సంబంధం కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యలో ముగ్గురు వ్యక్తులు పాల్గొని ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 2017లో కూడా రామశేషుపై హత్యాయత్నం జరిగిందని కుటుంబ సభ్యులు అంటున్నారు.

ఇదీ చదవండి: దారుణం.. మెడికో విద్యార్థి హత్య

ఇవి కూడా చదవండి: