Home / బ్రేకింగ్ న్యూస్
వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగింపు మంచిదేనని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ విషయమై టీడీపీ, దుష్టచతుష్టయం తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన విమర్శించారు.
బాధ్యతగా మెలగాల్సిన వైద్యుడి బాధ్యతారాహిత్యం వల్ల నిండు ప్రాణం బలైంది. ఓ డాక్టర్ చేసిన నిర్లక్ష్యం వల్ల ఆ మహిళకు గర్భశోకం మిగిల్చింది. ప్రసవ వేదనతో ఆస్పత్రిలో చేరిన మహిళను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా.. పుట్టెడు శోకాన్ని మిగిల్చారు. వైద్యుడి వీడియో కాల్ సూచనల మేరకు నర్సులు ఆమెకు డెలివరీ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని చెంగల్పుట్టు సునంబేడు గవర్నమెంట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
రాజకీయాలు నాకు దూరం కాదు అంటూ చిరంజీవి అటు అభిమానుల్లోనూ ఇటు రాజకీయనేతల్లోనూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి కొత్త ఐడీ కార్డును జారీ చేసింది. పీసీసీ డెలిగేట్గా చిరును గుర్తిస్తూ ఈ కొత్తకార్డును ఇచ్చింది. ఈ కార్డుకి 2027 వరకు కాలపరిమితి వుంటుందని తెలిపింది.
నైతికత గురించి మాట్లాడేదే భగవద్గీతగా కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. భగవద్గీత మత గంధ్రం కాదంటూ ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నగేష్ పేర్కొన్నారు.
ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారుల బృందం ముంబైలోని నవ సేవా పోర్ట్ నుండి హెరాయిన్ పూసిన 20 టన్నుల కంటే ఎక్కువ లైకోరైస్ను కలిగి ఉన్న కంటైనర్ను స్వాధీనం చేసుకుంది.
కర్ణాటకలోని బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్న ఆరోపణలతో కాంగ్రెస్ బుధవారం ఉదయం బెంగళూరు అంతటా 'PayCM' పోస్టర్లను ఏర్పాటు చేసింది.
పొంతన లేని ఆరోపణలతో మధ్యప్రదేశ్ భాజాపా నేతలు, కాంగ్రెస్ అగ్రనేత తలపెట్టిన భారత్ జోడో యాత్రను అడ్డుకొనేందుకు కుటిలయత్నం చేస్తున్నారు.
తమిళనాడులో ఇటీవలె కాలంలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో ఇంటర్ విద్యార్థిని టాయిలెట్లో శవమై కనిపించింది. ఈ ఘటనతో ప్రస్తుతం తమళనాట తీవ్ర విషాదం నెలకొంది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోవిలువైన వక్ఫ్ ఆస్తులను భూ మాఫియాలు స్వాధీనం చేసుకున్నారనే ఫిర్యాదులపై చర్య తీసుకునేందుకు సర్వే ప్రారంభించినట్లు యుపి డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య బుధవారం చెప్పారు.
పీఎం కేర్స్ ఫండ్ కు కొత్తగా మరికొందరు ప్రముఖులను ట్రస్టీలుగా నియమించారు. ఇందులో ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ఉన్నారు.