Last Updated:

Nara Lokesh: హెల్త్ వర్సిటీకి.. వైఎస్సార్‌ కు ఏం సంబంధం.. నారా లోకేష్

ఏపీ చరిత్రలో నేడు బ్లాక్‌ డే అని టీడీపీ నేత నారా లోకేష్‌ అన్నారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును వైఎస్సార్‌ యూనివర్సిటీగా మార్చడాన్ని ఆయన ఖండించారు. హెల్త్‌ యూనివర్సిటీ కట్టింది ఎన్టీఆర్‌ అని, వైఎస్‌ఆర్‌కు దానితో ఎలాంటి సంబంధం లేదన్నారు.

Nara Lokesh: హెల్త్ వర్సిటీకి.. వైఎస్సార్‌ కు ఏం సంబంధం.. నారా లోకేష్

Amaravati: ఏపీ చరిత్రలో నేడు బ్లాక్‌ డే అని టీడీపీ నేత నారా లోకేష్‌ అన్నారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును వైఎస్సార్‌ యూనివర్సిటీగా మార్చడాన్ని ఆయన ఖండించారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని పేరు మార్చడమేంటన్నారు. హెల్త్‌ యూనివర్సిటీ కట్టింది ఎన్టీఆర్‌ అని, వైఎస్‌ఆర్‌కు దానితో ఎలాంటి సంబంధం లేదన్నారు. అలాంటి ఆయన పేరు ఎలా పెడతారంటూ ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ యూనివర్సిటీకి చెందిన నాలుగువందలకోట్ల రూపాయలను జగన్‌ దోచుకున్నారని ఆరోపించారు. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే త్వరలోనే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రం పేరును కూడా మార్చేస్తుందన్నారు.

సైకో జగన్‌ మోహన్‌ రెడ్డి ఏపీకి సీఎం అయ్యారని, సీఎం అయినప్పటి నుంచి అన్నిటికీ పేర్లు మారుస్తూ వస్తున్నారని ధ్వజమెత్తారు. సైకో, సీఎం అయ్యాక మూడు ముక్కలాట మొదలెట్టారని మండిపడ్డారు. 3 ప్రాంతాల అభివృద్ధికి సీఎం ఏం చేశారు అని ప్రశ్నించారు. 9 బిల్లులను ఎలాంటి చర్చ లేకుండానే 9 నిమిషాల్లో పాస్‌ చేసుకున్నారని తప్పుబట్టారు. మమ్మల్ని తట్టుకోలేకే ఐదురోజులే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని తప్పుబట్టారు.

టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం అయ్యాక హార్టికల్చర్‌ వర్సిటీకి వైఎస్‌ పేరు తీయలేదని తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు ఎందుకు మార్చాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే తిరిగి ఎన్టీఆర్‌ పేరు పెట్టితీరుతామని లోకేష్‌ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి: