Home / బ్రేకింగ్ న్యూస్
ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ (58) ఇక లేరు. స్టాండ్ అప్ కామెడీలో ఒక వెలుగు వెలిగిన శ్రీవాస్తవ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య కారణాలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీవాస్తవ తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగి.. ముగ్గురు వ్యక్తులు సజీవదహనం అయ్యారు.
చంద్రబాబు సర్కార్ హయంలో స్టేట్ డేటా సెంటర్ నుండి డేటా చోరీ జరిగిందని ఏపీ శాసనసభ సంఘం తేల్చింది. కాల్ ట్యాపింగ్ నుంచి సమాచారం దొంగింలించారన్న కోణంలో తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ విచారణ జరిపింది.
సైనిక పాలనలో ఉన్న మయన్మార్‌లో దారుణం చోటు చేసుకొంది. ఓ పాఠశాలపై సైనిక హెలికాప్టర్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 7 Children Among 13 Killed After Myanmar Army Helicopter Attacks School
ఏపీ ప్రభుత్వం ప్రజా ప్రతినిధులపై కక్ష సాధింపును మాత్రం వదలడం లేదు. ప్రతిపక్ష పార్టీ నేతలను ఇబ్బందులు పెట్టేందుకు అధిక ప్రాధాన్యమిస్తుంది. తాజాగా మాజీ మంత్రి నారాయణను విదేశాలకు వెళ్లకుండా తలపెట్టిన లుకౌట్ నోటీసును కోర్టు పక్కన పెట్టింది
మంత్రి సత్యవతి రాథోడ్ కు చేదు అనుభవం ఎదురయింది. ములుగు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్ ను టీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో దళితులు అడ్డుకున్నారు.
ఇటీవలె కాలంలో బాక్సాఫీస్ వద్ద రీ-రిలీజ్‌ల పర్వం కొనసాగుతుంది. కాగా తమ అభిమాన స్టార్ హీరోల సినిమాలను రి-రిలీజ్ చేస్తూ అభిమానులు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదని చెప్పవచ్చు. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజున ‘పోకిరి’, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా, తమ్ముడు వంటి సినిమాలను స్పెషల్ షోలుగా రీ-రిలీజ్ చేశారు అభిమానులు కాగా ఇప్పుడు ఆ వరుసలో బాలయ్యబాబు కూడా చేరాడు. చెన్నకేశవ రెడ్డిగా థియేటర్లలో మళ్లీ రచ్చలేపనున్నాడు.
తెలంగాణాలో అనేక చోట్ల విద్యార్ధులు పుడ్ పాయిజన్ కు గురౌతున్నారు. పేదలను ఆదుకొంటున్నామంటున్న వారే చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పట్టెడి అన్నం తినే ఆ నోటికాడ కూడులో కాసుల కక్కుర్తి విద్యార్ధుల గొంతు నొక్కేస్తుంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు వడోదర విమానాశ్రయంలో 'మోదీ, మోదీ' నినాదాలతో కొందరు స్వాగతం పలికారు. అయితే కేజ్రీవాల్ దీనిపై పెద్దగా స్పందించకుండా తన వాహనం ఎక్కి వెళ్లిపోయారు.
టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ అక్రమ కార్యకలాపాల ద్వారా భారీ మొత్తంలో నగదు సంపాదించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది.