Home / బ్రేకింగ్ న్యూస్
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఢిల్లీలోని మసీదును సందర్శించి దాని ప్రధాన మతపెద్దలతో సమావేశమయ్యారు. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన మతగురువు ఉమర్ అహ్మద్ ఇలియాసిని ఢిల్లీ మసీదులో కలిశారు.
ఖమ్మం జిల్లాలోనే మరో ఇంజక్షన్ హత్య వెలుగు చూసింది. బైక్ పై లిఫ్ట్ అడిగి ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసి ఘటన మరువక ముందే అలాంటి మరో ఘటన వెలుగులోకి రావడం ఖమ్మం జిల్లా ప్రజలను కలవరపెడుతుంది.
తెలంగాణ మంత్రి కేటీఆర్ జోకర్ ట్వీట్ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నారని, ఆ మాటలు పట్టించుకోమన్నారు.
ఎట్టకేలకు హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ లైన్ టిక్కెట్లు అయిపోయాయని ప్రకటించింది. ఆన్ లైన్ టిక్కెట్లను ఈ రోజు రాత్రి 7గంటల తర్వాత అందుబాటులో ఉంచుతామని నిర్వాహకులు తెలిపారు.
ఆర్ఆర్ఆర్ ను కాదని ఇండియా నుంచి ఆస్కార్‌కు అఫీషియల్ గా "ఛెల్లో షో" మూవీ ఎంట్రీ ఇచ్చింది. దీనిపై మూవీ లవర్స్ అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాను కాదని.. అప్పటి వరకూ పేరు కూడా వినబడని సినిమాను పంపడంపై తెలుగు సినీ లోకం, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరో నిఖిల్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ ఎంట్రీపై తన అభిప్రాయాన్ని తెలిపారు.
జింఖానా గ్రౌండ్మ లో క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాల సందర్బంగా చోటు చేసుకున్న పరిణామాల పై క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) బాధ్యతా రాహిత్యం వల్లే ఈ సంఘటన జరిగిందని ఆయన విమర్శించారు.
వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి 75 కొత్త వందేభారత్ రైళ్లను నడపాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. అందువల్ల ప్రతినెలా ఏడెనిమిది రైళ్లు సిద్ధంగా ఉండాలన్నది రైల్వే లక్ష్యం కావడంతో ఈ రైళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేశారు.
నేటి సమాజంలోని పెళ్లికి ముందు ప్రేమలు కామన్ అయిపోయాయి. అయితే అది పెళ్లయిన తర్వాత బ్రేక్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో పెళ్లైనాక కూడా చాటుమాటుగా ప్రేయసితో ప్రేమ వ్యవహారం నడిపిస్తుంటారు మరికొందరు. అయితే అది బయటపడిన రోజు భార్యలు చేసే గొడవ అంతా ఇంత కాదు. ఇంక భర్త వేరే వాళ్లతో చనువుగా ఉంటున్నాడంటేనే రచ్చరచ్చ చేసే భార్యలున్న నేటి కాలంలో ఓ ఆడపడుచు తన భర్త వేరే అమ్మాయిని ప్రేమించాడని తెలుసుకుని... భర్తకు ప్రేయసిని ఇచ్చి మరల పెళ్లిచేసింది ఈ భార్యామణి.
జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో కేంద్ర భద్రతా దళాల సోదాల్లో ఇద్దరు మిలిటెంట్లు దొరికారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అభిమానులతో ఆటలాడుకొంటుంది. టిక్కెట్ల అమ్మకాల విషయంలో అడ్డదారులు దొక్కుతూ అభిమానులను చిర్రెత్తుకొచ్చేలా చేసింది. తమ ప్లేయర్స్ కొట్టే షాట్ల కోసం గత రెండు రోజులుగా టిక్కెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్ వద్ద అభిమానులు పడిగాపులు కాస్తున్నారు