Home / బ్రేకింగ్ న్యూస్
అన్‌స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది. మరింత రంజుగా షో ప్రారంభిద్దాం అంటున్న బాలయ్య లుక్ ఈ ట్రైలర్లో అదిరిపోయింది. అక్టోబర్ 14 నుంచి ప్రతి శుక్రవారం అన్‌స్టాపబుల్ సీజన్-2 స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా సంస్థ తెలిపింది.
వైకాపా అసమ్మతి నేత దారుణ హత్యకు గురయ్యాడు. కళ్లల్లో కారం చల్లి 18 చోట్ల వేడకొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపేశారు దుండగులు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో చోటుచేసుకుంది
ముంబై మహా నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చెంబూర్‌లో 12 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలోనే చాలామంది చిక్కుకుని ప్రాణాలను రక్షించుకునేందుకు చాలామంది కిటికీల నుంచి బయటకు రావడానికి ప్రయత్నించారు.
ప్రేమించమంటూ వెంటపడిన ఓ యువకుడు, తన ప్రేమను నిరాకరించిందని యువతిపై పగ పెంచుకుని ఆమెపై కత్తితో దాడి చేసి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కూరాడలో చోటుచేసుకుంది.
రూ.1,200 కోట్ల విలువైన హెరాయిన్ నుఇండియన్ నేవీ మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు సంయుక్తంగా దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు.
ఏపీ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. విశాఖ కేంద్రంగా రాజకీయనేతలు వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతున్నారు. కాగా తాజాగా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సామ్ శుక్రవారం రోజు తన పెంపుడు శునకం ఫొటోను షేర్ చేసి ఆ పోస్ట్‌కి ‘‘వెనక్కి తగ్గా కానీ ఓడిపోలేదు’’ అంటూ క్యాప్షన్ రాసింది.
దసరా అయిపోయి దీపావళి వచ్చేస్తుంది. దీపావళి పండుగను ఉత్తరాది రాష్ట్రాల్లో వైభవంగా నిర్వహించుకుంటారు. కాగా ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు శని, ఆదివారాల్లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనింది.
ఆన్లైన్ యాప్ల్ ద్వారా సేవలందిస్తున్న ప్రముఖ ట్యాక్సీ సంస్థలైన ఓలా, ఉబర్, ర్యాపిడోలకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రంలో ఈ ఆటో సర్వీసులు నిలిపివేయాలని ఆయా సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
మెట్రో రైలు ప్రయాణీకులకు ఓ శుభవార్త. ఇప్పటివరకు ఉన్న రైళ్ల రాకపోకల వేళలను మరింత పెంచింది. రాత్రి 10.15 గంటల వరకు ఉన్న రైలు సేవలను 11 గంటల వరకు పొడిగించారు. పొడిగించిన వేళలు సోమవారం 10వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి.