Sabitha Indra Reddy: బంజారాహిల్స్ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు.. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి
హైదరాబాదులో విద్యా వ్యవస్ధకు మచ్చ తెచ్చేలా చోటుచేసుకొన్న చిన్నారి లైంగిక దాడి వ్యవహరంలో బంజాహిల్స్ డీఏవీ పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సరైన నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు.
Hyderabad: హైదరాబాదులో విద్యా వ్యవస్ధకు మచ్చ తెచ్చేలా చోటుచేసుకొన్న చిన్నారి లైంగిక దాడి వ్యవహరంలో బంజాహిల్స్ డీఏవీ పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సరైన నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు.
పాఠశాలలో ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న విద్యార్ధులు నష్ట పోకుండా ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని మంత్రి సబిత సూచించారు. ఈ వ్యవహరంలో విద్యార్ధులు తల్లి తండ్రుల సందేహాలను నివృత్తి చేసే బాధ్యత డీఈవోదేనని, అందుకు తగిన విధంగా వ్యవస్ధను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.
ఇప్పటికే పాఠశాల ప్రిన్సిపల్ పై బంజారాహిల్స్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. డ్రైవర్ రజనీకుమార్ ఈ లైంగిక దాడికి పాల్పొడ్డాడు. ప్రిన్సిపల్ గదికి సమీపంలోనే ఘటన చోటుచేసుకొన్నా, నిరోధించేందులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నేపథ్యంలో ప్రిన్సిపల్ పై కూడా కేసు నమోదైంది. ఇరువురుని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. వారికి 14 రోజుల రిమాండ్ ను న్యాయమూర్తి విధించారు. అనంతరం పోలీసులు వారిని చంచలగూడ జైలుకు తరలించారు.
ఇది కూడా చదవండి: Jharkhand: విద్యార్థిని బట్టలు విప్పించిన టీచర్.. బాలిక ఆత్మహత్యాయత్నం..!