Home / బ్రేకింగ్ న్యూస్
దీపావళి నాడు ఢిల్లీలో గాలి నాణ్యత 'చాలా పేలవమైన' కేటగిరీలో నమోదయింది. దీనితో ఇది ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది.
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామాతో వేడెక్కిన బ్రిటన్ రాజకీయాలకు ఎట్టకేలకు తెరపడింది. కన్జర్వేటివ్ పార్టీ నేత, బ్రిటన్ తదుపరి ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికైనారు. సునాక్ భారత దేశ సంతతికి చెందిన వ్యక్తి కావడంతో బ్రిటన్ లోని భారత పౌరులు సంబరాల్లో మునిగిపోయారు
ప్రముఖ అంతర్జాతీయ సంస్ధ ఫిలిప్స్ తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఉద్యోగుల సంఖ్యలో 5శాతం మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ఆ కంపెనీ సీఈఓ రాయ్ జాకోబ్స్ పేర్కొన్నారు. దీంతో 4వేల మందిని తొలగించక తప్పలేదని ఆయన పేర్కొన్నారు.
దాయాదీ దేశంతో జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. ఆఖరి ఓవర్ ఓవర్ లో ఆఖరి బంతి వరకు ఎవరు గెలుస్తారా అని సాగిన ఉత్కంఠ పోటీలో ఎట్టకేలకు విజయం టీం ఇంటియా సొంతం అయ్యింది.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు దాయాదీ దేశమైన పాకిస్థాన్ తో భారత జట్టు సమరం ప్రారంభమయ్యింది. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టుకు భారత్ ముచ్చమటలు పట్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది పాక్.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ (ఇస్రో) అత్యంత బరువైన రాకెట్ ఎల్విఎం3-ఎం2 తొలి వాణిజ్య మిషన్‌లో UK ఆధారిత కస్టమర్‌కు చెందిన 36 బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఆదివారం (అక్టోబర్ 23) విజయవంతంగా నిర్దేశించిన కక్ష్యలోకి చేర్చినట్లు ఇస్రో తెలిపింది.
చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో గాంధీ కుటుంబానికి సంబంధించిన ప్రభుత్వేతర సంస్థ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్‌జిఎఫ్) విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సిఆర్ఎ) లైసెన్స్‌ను కేంద్రం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు
తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల్లోని అధికార పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ప్రభాస్ 43వ పుట్టిన రోజును పురస్కరించుకుని ఫ్యాన్ బిల్లా సినిమాను 4Kలో గ్రాండ్ గా రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా అభిమానుల అత్యుత్సాహం వల్ల ఓ థియేటర్ కాలిపోయింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో చోటుచేసుకుంది.
దీపావళి పండుగ వేళ విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. టాపాసుల దుకాణంలో అగ్నిప్రమాదం జరగడం వల్ల ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.