Home / బ్రేకింగ్ న్యూస్
మెయినాబాద్ ఫామ్ హౌస్ లో పోలీసులకు రెడ్ హ్యాండడ్ గా పట్టుబడిన తెరాస శాసనసభ్యుల ఆకర్ష్ ఘటన పై న్యాయస్ధానాన్ని ఆశ్రయించనున్నట్లు భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు.
ట్విట్టర్ కొనుగోలుకు ఎట్టకేలకు మస్క్ మొగ్గు కనపరుస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విట్టర్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఇంత వరకూ బాగానే ఉన్న ఆయన ట్విట్టర్ ఆఫీసుకు వెళ్తూ తన చేతిలో సింక్ పట్టుకుని వెళ్లారు.
నయనతార విఘ్నేశ్ శివన్ జోడి సరోగసి విషయంపై తీవ్ర దుమారం రేగుతున్న విషయం విధితమే. అయితే తాజాగా ఈ తమిళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నయన్ దంపతుల సరోగసి వ్యవహారం చట్టబద్ధమే అని తేల్చి చెప్పింది.
తెలంగాణ మునుగోడు ఉపఎన్నికల వేళ అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తీవ్ర కలకలకం రేపుతోంది. ఇకపోతే ఈ వ్యవహారం మరియు భాజపాపై వస్తున్న ఆరోపణలను భాజపా నేత బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. అధికార టీఆర్ఎస్పై స్ట్రాంగ్ కౌంటర్లు వేశారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్తో సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ భేటీ అయ్యారు.
మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకి రాజీనామా చేశారు.ఈ మేరకు బుధవారం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాపోలు ఆనంద్ భాస్కర్ రాజీనామా లేఖ పంపారు.
ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం మంగళవారం అక్కడి భారతీయులందరినీ వెంటనే దేశం విడిచి వెళ్లాలని కోరింది.
ఉగాండాలో ఘోరం చోటుచేసుకొనింది. ఓ పాఠశాలలో చెలరేగిన మంటల్లో 11 మంది విద్యార్ధులు అగ్నికి ఆహుతైనారు. శరీరాలు సైతం గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. తీవ్ర గాయాలైన మరికొంత మంది విద్యార్ధులను వైద్యశాలకు తరలించారు.
అగ్నిమాపక శాఖ సిబ్బంది నిర్లక్ష్యం ఖరీదు రెండు వందల దుకాణాలను బూడిద చేసింది. 3కోట్లకు పైగా ఆస్తి నష్ట వాటిల్లేలా చేసింది. నేటి తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో జరిగిన ఆ సంఘటన అరుణాచల ప్రదేశ్ లో చోటు చేసుకొనింది.
గుజరాత్ రాష్ట్రం వడోదరలో అల్లర్లు చోటుచేసుకొన్నాయి. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చే క్రమంలో వివాదం చోటుచేసుకొనింది. దీంతో ఇరువర్గాల మద్య మాటల యుద్దం తీవ్రం దాల్చింది. హఠాత్తుగా ఓ వర్గం వారు మరో వర్గంపై రాళ్లు రువ్వుకోవడం, విధ్వంసానికి దిగారు.