Home / బ్రేకింగ్ న్యూస్
మంత్రి జగదీశ్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగా నగదు దొరికినట్టుగా వార్తలు వినవస్తున్నాయి. రాత్రి నల్లగొండలోని ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు.
ఒకప్పటి టాలీవుడ్ హాట్ హీరోయిన్ రంభ కారు రోడ్డుప్రమాదానికి గురైయ్యింది. ఈ ప్రమాదంలో ఆమెకు మరియు ఆమె కుటుంబీకులకు గాయాలయ్యాయని ఇన్ స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేసింది రంభ.
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజి) సిలిండర్ల దొంగతనాన్ని చేపట్టేవారికి కేంద్రం చెక్ పెట్టింది. ఇంటివద్దకే గ్యాస్ సిలిండర్లను అందుకొనే వినియోగదార్లు ఇకపై ఓటిపితో గ్యాస్ డెలివరీని తీసుకొనేలా చేసింది. ఇందుకోసం నేటి నుండి కొత్త డెలివరీ అధెంటికేషన్ కోడ్ (డిఏసి) విధానాన్ని తీసుకొచ్చింది.
పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఏడాది ప్రతిపాదికన 22 నుంచి 26 శాతం పెరిగాయని,అక్టోబర్ మొదటి నెలవారీ పెరుగుదల ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అక్టోబర్ 1 నుంచి 15 మధ్య పెట్రోల్ అమ్మకాలు 22.7 శాతం పెరిగి 1.28 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి.
స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు గడించిన టాటా స్టీల్ కంపెనీ మాజీ ఎండీ జంషెడ్ జే ఇరానీ కన్నుమూశారు. జంషెడ్‌పూర్‌లోని టాటా మెయిన్ హాస్పిటల్లో ఆయన గతరాత్రి అనగా సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.
ఆర్ కృష్ణయ్య ఒక బ్రోకర్ అని మాజీ మంత్రి బండారు సత్యానారాయణమూర్తి మండిపడ్డారు.
డిసెంబర్ 4 నుండి 26వరకు బంగ్లాదేశ్ లో జరగనున్న క్రికెట్ పోటీల్లో టీమిండియా జట్టును బీసిసిఐ ప్రకటించింది.
గుజరాత్ రాష్ట్రం మోర్బీలో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జ్ ఘటనను మరవకముందే ఉత్తరప్రదేశ్ లో ఓ కల్వర్డు కుప్పకూలింది. అయితే ఘటనలో ప్రజలు క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు.
ఇరాన్లో హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. తాజాగా ఇరాన్లో సెలెబ్రిటి చెఫ్ మెహర్షాద్ షాహిదీ పోలీసుల చేతిలో దుర్మరణం పాలయ్యాడు. షాహిదీని బ్రిటన్‌కు చెందిన జెమీ ఆలివర్‌గా సంబోధిస్తుంటారు.