Home / బ్రేకింగ్ న్యూస్
ఆప్ నేత సత్యేందర్ జైన్ రూ. 10 కోట్లు ఇవ్వాలని బలవంతం చేశారంటూ జైలు శిక్ష అనుభవిస్తున్నసుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు లేఖ రాశాడు.
రాజధాని రైతులు తలపెట్టిన అమరావతి టు అరసవళ్లి పాదయాత్రను కొనసాగించవచ్చంటూ హైకోర్టు పచ్చ జెండా ఊపింది. ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్ధానం కొట్టేసింది. రైతుల పాదయాత్రకు అనుమతిచ్చింది.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు దాఖలు చేసిన కంపెనీ సమాచారం ప్రకారం, ఎలోన్ మస్క్ సోమవారం ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను తొలగించి, తనను తాను ఏకైక సభ్యునిగా ప్రకటించుకున్నారు
మునుగోడు ఉప ఎన్నికల వేడి నేటితో ముగియనున్న నేపథ్యంలో పలివెల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భాజపా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాన్వాయిపై తెరాస కార్యకర్తలు రాళ్లదాడి చేశారు.
నేడు మోదీ మోర్బీ వంతెన కూలిన ఘటన స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లనున్నారు. దానితో ‘ గో బ్యాక్ మోదీ’ అంటూ ట్విట్టర్ వేదికగా నెటిజన్లు #Go_Back_Modiహాష్ ట్యాగ్ ను తెగ ట్రెండ్ చేస్తున్నారు.
దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో భారీ రాబడిని కొనసాగిస్తున్నాయి. అక్టోబర్ నెలకు గాను రూ. 1,51,718 కోట్లు వసూలైన్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంలో దాఖలైన పిటిషన్లను నేను లేని మరో ధర్మాసనంకు బదిలీ చేయాలని చీఫ్ జస్టిస్ యు. యు. లలిత్ రిజిస్ట్రీని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మహారాష్ట్ర, పుణెలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లుల్లా నగర్ చౌక్‌లోని 7 అంతస్తుల మార్వెల్ విస్టా భవంతిలోని పైఅంతస్తులో ఘటన చోటుచేసుకొనింది. ఉదయం 8.15 గంటల వెజిటా రెస్టారెంట్లో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగసి పడ్డాయి.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర భాగ్యనగరంలోకి ప్రవేశించింది. శంషాబాద్ నుండి రాజేంద్రనగర్, బహదూర్ పుర, చార్మినార్, గోషామహల్, నాంపల్లి, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి వరకు నగరంలోని ఏడు నియోజకవర్గాల్లో దాదాపు 45 కిలోమీటర్ల వరకు రెండు రోజుల పాటు సాగనుంది.