Home / బ్రేకింగ్ న్యూస్
ఛత్తీస్‌గఢ్‌లో మావోలు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు హతమయ్యారు. కాంకేర్ జిల్లాలోని సిక్సోడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కడ్మే శివారు అటవీ ప్రాంతంలో సోమవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
అక్టోబర్ మాస చివర రోజున షేర్ ట్రేడింగ్ మదుపరుల్లో సంతోషాన్ని నింపింది. బిఎస్ఈ సెన్సెక్స్ 786.74 పాయింట్లు లాభపడి 60,746-59 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 225.40 పాయింట్లు లాభపడి 18,012-20 వద్ద ముగిసింది.
గుజరాత్ లోని మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనలోరాజ్‌కోట్‌కు చెందిన బీజేపీ ఎంపీ మోహన్‌భాయ్ కుందారియా కుటుంబ సభ్యులు 12 మంది ఆదివారం ప్రాణాలు కోల్పోయారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు.
ఉప ఎన్నికకు తరలిస్తూ రూ. 89.91లక్షల నగదు హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్సు పోలీసులకు పట్టుబడింది. భాజపా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యక్తిగత సహాయకుడి డ్రైవర్ తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
తెదేపా నేత, మాజీ మంత్రి నారాయణకు చిత్తూరు 9వ అదనపు జిల్లా కోర్టు బెయిల్ రద్దు చేసింది. పదవ తరగతి పరీక్షా పత్రాల లీక్ కేసులో బెయిల్ పై మంత్రి నారాయణ ఉన్నారు. నవంబర్ 30 లోపు పోలీసులకు లొంగిపోవాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అత్యాచారం కేసుల్లో రెండు వేళ్ల పరీక్ష ను నిషేధించాలని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించింది.
సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ అయిన ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఎలన్ మస్క్ సంచలన నిర్ణయాలు, మైక్రోబ్లాగింగ్ యాప్ లో తనదైన స్టైల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ ఎకౌంట్ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో పలు మార్పులు చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు.
అనుకూలంగా ఉంటే సరి, లేదంటూ రాజ్యంగ పదవిని అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలను ఓ ఆటాడుకొంటున్న కేంద్ర ప్రభుత్వ చర్యలపై విసిగిపోతున్నారు. ముఖ్యంగా గవర్నర్ గిరి వ్యవస్ధను భ్రష్టుపట్టిస్తున్నారని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గొల్లుమంటున్న తరుణంలో తాజాగా గవర్నర్ గారు మీరు పదవి నుండి తప్పుకోండంటూ తమిళనాడు అధికార ప్రభుత్వం డిఎంకే కూటమి డిమాండ్ చేసింది.
తెలంగాణలోని రాజకీయ పార్టీ నేతలంతా ఇప్పుడు మునుగోడు బైపోల్స్ ను ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. నువ్వా నేనా అన్నట్టు మాటలతూటాలు వ్యూహ ప్రతి వ్యూహాలతో అధికార ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి. కాగా తాజాగా మునుగోడు ఎన్నికల బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.