Home / బ్రేకింగ్ న్యూస్
పెర్త్ వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన అమీతుమీ మ్యాచ్ లో ఎట్టకేలకు సఫారీ జట్టు గెలుపొందింది. టీ20 వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉన్న టీమిండియా దూకుడుకు సఫారీ జట్టు బ్రేక్ వేసింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది.
గుజరాత్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మోర్బీ ప్రాంతంలోని సస్పెన్షన్ బ్రిడ్జి కుప్పకూలింది. ఆ సమయంలో బ్రిడ్జ్ పై ఉన్న దాదాపు 400 మంది సందర్శకులు నదిలో పడిపోయినట్లు సమాచారం.
పెర్త్ మైదానం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఈ మ్యాచ్ మొదటి నుంచి తడబడుతూ ఆడిన భారత బ్యాటర్ల టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైందని చెప్పవచ్చు. సఫారీల బంతుల ధాటికి టీం ఇండియా వరుస వికెట్లను కోల్పోయింది. కాగా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి టీం ఇండియా 133 పరుగులు చేసింది.
ఏపీలో జనసేన మంచి స్పీడుతో దూసుకెళ్తోంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో అధికార వైసీపీని ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగానే వరుస కార్యక్రమాలతో జనసైనికుల్లో జోష్ నింపుతున్నారు పవన్. ఇకపోతే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో నేడు పీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు.
ట్విటర్ సహ-వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సే ట్విట్టర్ కు పోటీగా మరో కొత్త సామాజిక మాధ్యమాన్ని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే దానికి సంబంధించి పని పూర్తయినట్లు ఆయన తెలిపారు. ఈ కొత్త సామాజిక మాధ్యమ వేదికకు ‘బ్లూస్కై’గా నామకరణం చేసినట్టు సమాచారం.
మునుగోడు బైపోల్స్ లో భాగంగా చండూరు మండలం బంగారిగడ్డలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ భాజపాపై విరుచుకుపడ్డారు. ప్రజలకు ఓటుపై అవగాహణ కల్పించారు. మీకు చేతులెత్తి మొక్కుతున్న ఒక్కసారి సోచాయించండంటూ ఆయన తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విషయంలో కీలక నిర్ణయం వెల్లడించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రాష్ట్రంలో ఇకపై ఏ కేసులోనైనా దర్యాప్తు చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సిందేనంటూ ఆదేశాలు జారీచేసింది.
తెలంగాణాలో రాజకీయ ప్రకపంనలు సృష్టించిన తెరాస పార్టీ ఎమ్మెల్యే కొనుగోల ప్రలోభాల డీల్ కేసులో హైకోర్టు తెరదించింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేంతవరకు దర్యాప్తును కొనసాగించవద్దని సూచించింది.
ముంబై-గాంధీనగర్ వందే భారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ శనివారం ఉదయం గుజరాత్‌లోని అతుల్ రైల్వే స్టేషన్లో పశువును ఢీకొట్టడంతో రైలు ముందు ప్యానెల్ దెబ్బతింది.
ద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ శాసనసభ సెక్రటేరియట్ అతనిపై అనర్హత వేటు వేసింది.