Home / బ్రేకింగ్ న్యూస్
భాగ్యనగరంలోని ఔటర్ రింగు రోడ్డు పరిధిలో ఐటీ, ఫార్మా, సర్వీస్ సెక్టార్లు విస్తరిస్తున్న తరుణంలో ‘పబ్లిక్ సేఫ్టీ మెజర్స్’లో భాగంగా భద్రత ప్రమాణాలను మరింత పటిష్టం చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు నగరంలోని పలు ప్రాంతాలతో పాటు పార్కుల్లోనూ 8వేల సీసీ కెమెరాలు పెట్టేందుకు సిద్ధమయ్యింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్చకులకు గుడ్ న్యూస్. దేవాదాయ శాఖ పరిధిలో ఆలయాల్లో పనిచేసే అర్చకులకు ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈఓ కు దేవాదాయ శాఖ కమిషనర్ లేఖ రాశారు.
ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకుని తేలలేకపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాజాగా మరోమారు కొత్త రుణాన్ని సేకరించింది. తాజాగా మంగళవారం నాడు రూ.1,413 కోట్ల అప్పును తీసుకుంది.
పంటలపై తెగుళ్ల నియంత్రణకు రైతులు పిచికారీ చేసే ‘షార్ప్’(బ్యాచ్-ఎస్0264) రసాయనిక పురుగుమందుపై తెలంగాణ వ్యవసాయశాఖ నిషేధం విధించింది. ఆ మందు నాసిరకం అని తేలడంతో అమ్మకాలు, వినియోగంపై ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
హైదరాబాద్లో నేడు రాహుల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా భాగ్యనగరంలోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ ట్రాఫిక్ జోన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉండనున్నాయి.
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం దేవస్ధానంలో అగ్ని ప్రమాదం సంబవించింది. ఆలయంలోని అన్నపూర్ణ భవన్ లో ఈ ఘటన చోటు చేసుకొనింది.
బాబా వంగా, బల్లేరియా దేశానికి చెందిన ఒక ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని. ఈవిడ జోస్యం చాలా సందర్భాల్లో నిజమైంది.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి దేశానికి వచ్చే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు మరియు క్రైస్తవులకు పౌరసత్వ చట్టం, 1955 ప్రకారం భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి నేపధ్యంలో బంజారాహిల్స్ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం పునరుద్దదరించింది.
మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై పలివెల గ్రామంలో జరిగిన దాడిని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఖండించారు. ఓ పథకం ప్రకారం ఈటల పై దాడి చేశారని ఆయన మండిపడ్డారు.