Home / బ్రేకింగ్ న్యూస్
రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు 3.9 శాతం డీఏను శాంక్షన్ చేస్తూ మేనేజ్ మెంట్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పొలం పనులు ముగించుకుని ట్రాక్టర్ పై వచ్చేందుకు సిద్ధమవుతున్న వలస కూలీలపై విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు కూలీలు దుర్మరణం చెందారు.
ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మీదుగా ప్రవేశించినందున హైదరాబాద్‌లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా అడిలైడ్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. టాల్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత బ్యాటర్లు బరిలోకి దిగారు. ఫస్ట్ హాప్ ముగిసే సరికి భారత్ 184 పరుగులు చేసి బంగ్లాకు185 పరుగుల టార్గెట్ ను సెట్ చేసింది.
తెలంగాణలో అందరిదృష్టిని ఆకర్షిస్తున్న మునుగోడు ఉప ఎన్నికకు రేపు (గురువారం) పోలింగ్ జరగనుంది.
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.
అక్టోబర్ 29న ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకిన తర్వాత, చెన్నై మరియు దాని పరిసర జిల్లాల్లో విస్తృతంగా, భారీ వర్షాలు కురిశాయి.
డబ్బులు ఊరికే రావు అన్న మాటను ఇప్పుడు మస్క కూడా పాటిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇకపై ట్విట్టర్ లో బ్లూ టిక్ ఉచితం కాదు. బ్లూ టిక్ పొందడం కోసం నెలకు 8 డాలర్లు అనగా మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.660 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ కొత్త సీఈవో ఎలాన్ మస్క్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు.
తెలంగాణ ఇంటర్ బోర్డులో ఇంటర్ బోర్డు కార్యదర్శి అధికారాలను వికేంద్రీకరిస్తూ పాలనాపరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
భాగ్యనగరంలోని ఔటర్ రింగు రోడ్డు పరిధిలో ఐటీ, ఫార్మా, సర్వీస్ సెక్టార్లు విస్తరిస్తున్న తరుణంలో ‘పబ్లిక్ సేఫ్టీ మెజర్స్’లో భాగంగా భద్రత ప్రమాణాలను మరింత పటిష్టం చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు నగరంలోని పలు ప్రాంతాలతో పాటు పార్కుల్లోనూ 8వేల సీసీ కెమెరాలు పెట్టేందుకు సిద్ధమయ్యింది.