Home / బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉపఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు ఆయా పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ను ప్రారంభించారు. ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
ఉత్తర కొరియా మరోసారి దక్షిణ కొరియాను రెచ్చగొట్టింది. ఏకంగా 17 క్షిపణులను దక్షిణ కొరియా సముద్ర జలాల్లో ప్రయోగించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం తన ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక మొహల్లా క్లినిక్‌లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ వారికి గైనకాలజీ పరీక్షలు మరియు మందులు ఉచితంగా లభిస్తాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద ఓ మహిళ చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ప్రముఖ మహిళా సాధికారికత కార్యకర్త, గాంధేయవాది, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు ఎలబెన్ భట్ (89) కన్నుమూశారు. స్వల్ప అస్వస్థతతో గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించారు.
తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తక్కువ మంది విద్యార్ధులు చదువుతున్న పీజీ కోర్సులను రద్దు చేయాలని కళాశాల విద్యాశాఖ నిర్ణయించింది.
వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అస్వస్థతతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం నాడు ఆయన మరణించారు.
భారత్, బంగ్లా జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో ఎట్టకేలకు టీమిండియా గెలిచింది. డీఎల్ఎస్ ప్రకారం బంగ్లాదేశ్ టార్గెట్‌ను 16 ఓవర్లకు 151 పరుగులుగా డిసైడ్ చెయ్యగా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.
ఉత్కంఠగా సాగుతున్న భారత్, బంగ్లా జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ పునఃప్రారంభం అయ్యింది. దానితో మ్యాచ్ కు ఎక్కడ డీఎల్ఎస్ ప్రకటిస్తారో అని దాని ద్వారా భారత్ సెమీస్ కు చేరదేమో అని జంకుతున్న క్రికెట్ లవర్స్ కు కాస్త ఊరటనిచ్చేలా వర్షం నిలిచిపోయింది. దానితో మ్యాచ్ పునఃప్రారంభమైంది.
ఉత్కంఠబరితంగా సాగుతున్న భారత్, బంగ్లా జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ 2022 మ్యాచ్ కు వరుణుడు అడ్డు వచ్చాడు.