Skoda 3 New Cars: మార్కెట్ షేక్ అవ్వడం ఖాయం.. స్కోడా కొత్త కార్లు.. ఫీచర్లు అదుర్స్..!
Skoda 3 New Cars: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 వచ్చే ఏడాది జనవరి 17 నుంచి ఢిల్లీలో ప్రారంభం కానుంది. చాలా పెద్ద ఆటో కంపెనీలు ఈ షోలో పాల్గొని తమ తమ ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ షోలో స్కోడా తన అనేక కార్లను కూడా ప్రదర్శిస్తుంది, వీటిలో 3 కార్లపై అందరి దృష్టి ఉంది. ఈ కార్లు ఏవో తెలుసుకుందాం.
Skoda Octavia RS
జనవరిలో జరగనున్న ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో స్కోడా తన ఆక్టావియా ఆర్‌ఎస్‌ను ప్రదర్శించనుంది. ఇది తొలిసారిగా భారత్‌కు రాబోతున్న హై పెర్ఫామెన్స్ కారు. ఇది ఆక్టావియా 4వ తరం మోడల్. ఇంజన్ గురించి మాట్లాడితే ఆక్టావియా RS 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ TSI పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది, ఇది 265బిహెచ్‌పి పవర్, 370ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్, AT గేర్‌బాక్స్ సదుపాయాన్ని కలిగి ఉంటుంది. భద్రత కోసం ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అడాస్ ఉన్నాయి.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో స్కోడా తన మిడ్-సైజ్ SUV కోడియాక్‌ను కూడా అప్‌డేట్ చేయబోతోంది. మీడియా నివేదికల ప్రకారం.. కొత్త మోడల్‌లో మునుపటి కంటే ఎక్కువ స్థలం ఉండటమే కాకుండా, దాని పరిమాణంలో కూడా మార్పు ఉండచ్చు. భద్రత కోసం ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అడాస్ ఫెసిలిటీ ఉంటుంది. ఈ SUV 2.0L పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఈ కారు ధర ప్రస్తుత మోడల్ కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా. కంపెనీ దాని డిజైన్‌పై కూడా పని చేస్తుంది.
New-Gen Skoda Superb
సెడాన్ సూపర్బ్ ఒక గొప్ప సెడాన్ కారు, ఇది దాని సౌలభ్యానికి ప్రసిద్ధి చెందింది. స్కోడా ఈ కారు కొత్త తరం మోడల్‌ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించబోతోంది. ఈసారి దాని డిజైన్ నుండి ఇంటీరియర్, ఇంజిన్ వరకు పెద్ద మార్పులు చూడచ్చు. కొత్త స్కోడా సూపర్బ్‌లో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఇవ్వచ్చు. కానీ కంపెనీ ఈ కారును CBU మార్గం ద్వారా భారతదేశంలో విక్రయించనుంది. మీరు కూడా ఈ స్కోడా కార్లను చూడాలనుకుంటే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోకు వెళ్లడానికి సిద్ధం కండి.