Last Updated:

Moto G13 launched: భారత్ మార్కెట్ లోకి వచ్చిన మోటోరోలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్

వరల్డ్ వైడ్ గా ఇది వరకే రిలీజ్ అయిన ఈ ఫోన్ ను తాజాగా భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Moto G13 launched: భారత్ మార్కెట్ లోకి వచ్చిన మోటోరోలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్

Moto G13 launched: ప్రముఖ మొబైల్ సంస్థ మోటోరోలా సంస్థ ‘G’ సిరీస్ లో భాగంగా మరో కొత్త ఫోన్ ను భారత్ మార్కెట్లో విడుదల చేసింది. మోటో G13 పేరుతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ యాండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ను ఉపయోగించారు.

4జీ సపోర్ట్ తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ. 9999 లుగా కంపెనీ నిర్ణయించింది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసే వారికి 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తోంది. వరల్డ్ వైడ్ గా ఇది వరకే రిలీజ్ అయిన ఈ ఫోన్ ను తాజాగా భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ అమ్మకాలు ఏప్రిల్ 5 నుంచి మొదలవుతాయి.

 

Motorola G13 launched in India for Rs. 9999 - Smartprix

 

మోటో జీ13 ఫీచర్లు ఇలా ఉన్నాయి(Moto G13 launched)

4జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్
బ్యాక్ సైడ్ 50 MP+ 2MP + 2MP కెమెరా
సెల్ఫీల కోసం ముందుభాగంలో 8 MP కెమెరా
10 వాట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ లాంటి ఈ ఫోన్ లో ఉన్నాయి.