Last Updated:

Hero Motocorp Festive Offer: జోరందుకున్న పండుగ సీజన్.. హీరో శుభ సమయం ఆఫర్.. రూ. 1,999లకే హెచ్ఎఫ్ డీలక్స్!

Hero Motocorp Festive Offer: జోరందుకున్న పండుగ సీజన్.. హీరో శుభ సమయం ఆఫర్.. రూ. 1,999లకే హెచ్ఎఫ్ డీలక్స్!

Hero Motocorp Festive Offer: దేశంలో పండుగ సీజన్ జోరందుకుంది. దీపావళికి ముందు ధన్ తేరస్ కారణంగా మార్కెట్‌లు ఫుల్ రష్‌గా మారాయి. ఈ రోజు షాపింగ్ చేయడం శుభప్రదంగా భావిస్తారు. ద్విక్ర వాహనాల కంపెనీలు కూడా విక్రయాలు పెంచుకునేందుకు కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి. ఇందులో భాగంగానే దేశంలోనే అతిపెద్ద వాహన సంస్థ హీరో మోటోకార్ప్ శుభ సమయం ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మోటోకార్ప్ అందించే శుభ సమయం ఆఫర్ కింద మీరు ఈ నెలలో Hero HF Deluxe బైక్‌ను కొనుగోలు చేస్తే మీకు రూ. 5500 వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇది కాకుండా ఈ బైక్‌‌ను రూ. 1999 నెల ఈఎమ్‌ఐగా కూడా చెల్లించి ఇంటికి తీసుకెళ్లచ్ బైక్‌పై రూ. 5000 వరకు క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్లన్నింటి గురించి పూర్తి సమాచారం కోసం మీరు హీరో మోటోకార్ప్ షోరూమ్‌ని సంప్రదించవచ్చు.

Hero HF Deluxe Features
ఇంజిన్ గురించి మాట్లాడితే హీరో మోటోకార్ప్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో హెచ్‌ఎఫ్ డీలక్స్‌లో 97.2సీసీ ఇంజన్‌ను అందించింది. ఈ ఇంజన్ 8.36 PS పవర్, 8.05Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. ఈ బైక్ సిటీ, హైవేలో చాలా బాగా నడుస్తుంది. కానీ చిన్న ఇంజిన్ కావడంతో ఇంజిన్ హీట్ అవుతుంది. అందువల్ల దూర ప్రయాణానికి వెళ్లేటప్పుడు మధ్యలో గ్యాప్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ బైక్‌లో మెటల్ గ్రాబ్ రైల్, బ్లాక్ థీమ్ ఆధారిత ఎగ్జాస్ట్, క్రాష్ గార్డ్, అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ బైక్ లుక్ మెరుగుపరచడానికి కొత్త గ్రాఫిక్స్ అందించారు. ఈ బైక్‌లో 9.1 లీటర్ కెపాసిటి గల ఇంధన ట్యాంక్ ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిమీ. బైక్ ముందు, వెనుక చక్రాలలో డ్రమ్ బ్రేక్‌లు అందుబాటులో ఉన్నాయి.  డీలక్స్ ధర రూ. 59,998 (ఎక్స్-షోరూమ్)

ఇంజిన్ 8.05 Nm టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్ శక్తి,  పనితీరు పరంగా బాగుంది. కానీ  ఇంజిన్ పరంగా షైన్ కొద్దిగా మృదువైనది. డిజైన్ పరంగా షైన్ 100 మెరుగ్గా కనిపిస్తుంది. ఈ బైక్ ధర రూ.65 వేల నుంచి ప్రారంభమవుతుంది.