Last Updated:

Apple stores: భారత్ లో యాపిల్ తొలి రిటైల్ స్టోర్.. ఎక్కడ ప్రారంభంకానుందంటే..

దిగ్గజ మొబైల్ కంపెనీ యాపిల్ భారత్ లో తన అధికారిక స్టోర్ ను ప్రారంభించనుంది.

Apple stores: భారత్ లో యాపిల్ తొలి రిటైల్ స్టోర్.. ఎక్కడ ప్రారంభంకానుందంటే..

Apple stores: దిగ్గజ మొబైల్ కంపెనీ యాపిల్ భారత్ లో తన అధికారిక స్టోర్ ను ప్రారంభించనుంది. ముంబైలోని బంద్రా కుర్లా కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్న స్టోర్ ఏప్రిల్ 18న ప్రారంభం కానుంది. ఆరోజు నుంచే వినియోగదారులకు సేవలు అందించనుందని యాపిల్ వెల్లడించింది. ఈ స్టోర్ ను యాపిల్ బీకేసీ గా పిలుస్తున్నారు. అదే విధంగా మొదటి స్టోర్ ఓపెన్ చేసని రెండు రోజుల వ్యవధిలోనే రెండో స్టోర్ ను తెరుస్తున్నట్టు కంపెనీ పేర్కొంది.

 

ఢిల్లీలో యాపిల్ సాకేత్

రెండో స్టోర్ ను ఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఈ స్టోర్ కు యాపిల్ సాకేత్ గా వ్యవహిరిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండానే ఢిల్లీ స్టోర్ ప్రారంభించడం యాపిల్ యూజర్లకు పెద్ద సర్ ప్రైజ్. రెండు స్టోర్ లకు సంబంధించిన లోగో లపై కూడా యాపిల్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ముంబై స్టోర్ లోగో కు ఆ నగర ఐకానిక్ ఆర్ట్ ‘కాల్పీలి టాక్సీ ఆర్ట్’ తో తిర్చిదిద్దగా.. ఢిల్లోని యాపిల్ సాకేత్ స్టోర్ లోగోను ఢిల్లీ మహానగర సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా రూపొందించారు.

 

Apple store

 

భారత పర్యటనకు టిమ్ కుక్?

భారత్ లో యాపిల్ అధికారికంగా ప్రారంభించనున్న స్టోర్స్ ను ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ ప్రారంభిస్తారనే ప్రచారం బాగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన వచ్చే వారం భారత్ లో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని యాపిల్ అధికారింగా ప్రకటించలేదు. కాగా, చైనా బయట యాపిల్ కార్యకలాపాలను నిర్వహించాలని యాపిల్ భావిస్తోంది. ఈ క్రమంలో భారత్ కే తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఒక వేళ టిమ్ కుక్ స్వయంగా స్టోర్ల ప్రారంభానికి రానుండటమే దానికి కారణమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. టిమ్ పర్యటనతో భారత్ విస్తరించాలనుకుంటున్న యాపిల్ తన ప్రణాళికలను వేగ వంతం చేయాలని భావిస్తోంది. కాగా, టిమ్ కుక్ చివరిసారి 2016 లో భారత్ లో పర్యటించారు.