Published On:

Fire Accident: ఢిల్లీ మెట్రో దగ్గర భారీ అగ్నిప్రమాదం

Fire Accident: ఢిల్లీ మెట్రో దగ్గర భారీ అగ్నిప్రమాదం

Fire Accident At Nearby Delhi Metro Station: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రిథాలా మెట్రోస్టేషన్ సమీపంలో ఇవాళ ఉదయం మంటలు వ్యాపించాయి. పాలిథీన్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి.. ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది 16 ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. అగ్నిప్రమాదంతో పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలముకుంది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనలో ముగ్గురు గుర్తుపట్టలేని స్థితిలో బాడీలు కాలిపోయాయి. వీటిని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ మేరకు చనిపోయిన, గాయపడిన వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియలేదు.

ఇవి కూడా చదవండి: