Republic Day: ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు..
రిపబ్లిక్ డే వేడుకలు దేశమంతటా ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర ఉత్సవాలు అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Republic Day: రిపబ్లిక్ డే వేడుకలు దేశమంతటా ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర ఉత్సవాలు అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖర్, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు తదితరులు ఈ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఈ ఉదయం జాతీయ వార్ మెమోరియల్‌ను సందర్శించడంతో వేడుకలు మొదలయ్యాయి. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరుకున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి మళ్లీ ఈ బగ్గీని వినియోగించారు.
‘ఆవాహన్’తో మొదలయిన పరేడ్..(Republic Day)
కర్తవ్యపథ్‌కు చేరుకున్న తర్వాత రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత శకటాల ప్రదర్శన ప్రారంభమైంది. ఆ తర్వాత జరిగిన పరేడ్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సారి జాతీయ మహిళా శక్తితోపాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు. పరేడ్ ‘ఆవాహన్’తో మొదలైంది. ఆవాహన్లో వంద మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపించారు. సంప్రదాయ బ్యాండ్‌కు బదులుగా శంఖం, నాదస్వరం, నగారాతో ప్రదర్శన చేశారు. దేశంలోని పలు రాష్ట్రాలనుంచి వచ్చిన శకటాలు రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొన్నాయి. ఇందులో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన బాలరాముడి శకటం అందరినీ ఆకట్టుకుంది.
आस्था भी,
विरासत भी,
विकास भी…‘कर्तव्य पथ’ पर ‘नया उत्तर प्रदेश’!
जय श्री राम! pic.twitter.com/mOoFer6hiR
— Yogi Adityanath (@myogiadityanath) January 26, 2024