Last Updated:

Gaddam Vivek : రూ.200 కోట్లు అక్రమలావాదేవీలు.. గడ్డం వివేక్ పై ఈడీ కేసు

చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తన్న గడ్డం వివేక్ నివాసాలు, కార్యాలయాలపై ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనల కింద మంగళవారం సోదాలు నిర్వహించిన డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) రూ.100 కోట్లకు పైగా లావాదేవీలను గుర్తించింది.

Gaddam Vivek : రూ.200 కోట్లు అక్రమలావాదేవీలు.. గడ్డం వివేక్ పై ఈడీ కేసు

Gaddam Vivek :చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తన్న గడ్డం వివేక్ నివాసాలు, కార్యాలయాలపై ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనల కింద మంగళవారం సోదాలు నిర్వహించిన డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) రూ.100 కోట్లకు పైగా లావాదేవీలను గుర్తించింది.

ఫెమా నిబంధనల ఉల్లంఘన..(Gaddam Vivek)

ఈడీ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా), 1999 నిబంధనల ప్రకారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలంగాణలోని నాలుగు ప్రాంతాల్లో డాక్టర్ గడ్డం వివేకానంద్ నివాసాలతో పాటు వారి కంపెనీల కార్యాలయ ప్రాంగణాల్లో బుధవారం సోదాలు నిర్వహించింది.వేక్ బ్యాంక్ ఖాతా నుండి విజిలెన్స్ సెక్యూరిటీకి జరిగిన రూ.8 కోట్ల లావాదేవీపై దర్యాప్తు చేయాలన్న తెలంగాణ పోలీసుల సూచన ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.వివేక్, అతని భార్య మరియు విశాఖ ఇండస్ట్రీస్ విజిలెన్స్‌ సెక్యూరిటీతో 100 కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు జరిపినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. సంస్థ తన తాజా బ్యాలెన్స్ షీట్‌లో కేవలం రూ. 20 లక్షలను ‘ఆపరేషన్ల నుండి వచ్చే ఆదాయం’గా ప్రకటించింది. ఇది ప్రధానంగా దీర్ఘకాలిక రుణాలు మరియు అడ్వాన్సుల రూపంలో రూ. 64 కోట్ల విలువైన ఆస్తులను నివేదించింది. ఆరంభం నుండి, కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతా్లో క్రెడిట్ మరియు డెబిట్ లావాదేవీలు రూ. 200 కోట్ల కంటే ఎక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది.

విజిలెన్స్ సెక్యూరిటీపై వివేక్ పరోక్ష నియంత్రణ కూడా దర్యాప్తులో వెల్లడైంది. విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ప్రాథమికంగా ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. విదేశాల్లో వివేక్ ఒక సంస్దను ఏర్పాటు చేసినట్లు కూడా తెలిసింది. ఈడీ సోదాల్లో డిజిటల్ పరికరాల రికవరీ,అనేక కోట్ల విలువైన అనుమానాస్పద, లెక్కలు చూపని లావాదేవీలు, అలాగే ఆస్తి ఒప్పందాల్లో లెక్కలోకి రాని నగదును ఉపయోగించడాన్ని సూచించే నేరారోపణ పత్రాలు, గ్రూప్ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఇంటర్-కార్పోరేట్ డిపాజిట్లు సీజ్ చేయడం జరిగింది. విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ను భోగస్ సంస్దగా ఈడీ అధికారులు గుర్తించారు.