Operation Lotus: ఒక్కొక్క ఎమ్మల్యేకు రూ.25 కోట్లు ఆఫర్ చేస్తున్న బీజేపీ.. పంజాబ్ మంత్రి హర్పాల్ సింగ్
పంజాబ్‌లోని భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చడానికి భారతీయ జనతాపార్టీ కుట్రలు పన్నుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలన్ని తోసి పుచ్చుతోంది.
Punjab: పంజాబ్‌లోని భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చడానికి భారతీయ జనతాపార్టీ కుట్రలు పన్నుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలన్ని తోసి పుచ్చుతోంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చునేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తోందని బీజేపీ ఆప్ ప్రభుత్వం పై మండిపడుతోంది.
మాన్ ప్రభుత్వాన్నికూల్చడానికి అందుబాటులో ఉన్న అన్నీ అవకాశాలను బీజేపీ వినియోగించుకుంటోందని పంజాబ్ ఆర్థికమంత్రి హర్పాల్ సింగ్ చీమా ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటు ఆప్ ఎమ్మెల్యేలకు డబ్బు ఏర వేస్తోందని అన్నారు. ఆపరేషన్ లోటస్‌లో భాగంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా, దిల్లీ, రాజస్థాన్‌లలో గతంలో ఇలాంటి ప్రయత్నాలు చేసిందని ఆయన అన్నారు.
ఆప్ పార్టీ నుంచి తప్పుకొని బీజేపీతో కలిస్తే ఒక్కొక్కరికి 25 కోట్ల ఇస్తామని ఆఫర్ చేశారని తమ ఎమ్మేల్యేలు చెబుతున్నారని అన్నారు. దీంతో పాటు బీజేపీ పెద్దాయనను కూడా కలిపిస్తామని చెప్పారని, దీంతో పాటు బీజేపీలోకి మారితే పెద్ద పదవుల్లో కూర్చోబెడతామని కూడా ఆశ చూపారని చీమా చెప్పారు. మీతో పాటు మరి కొందరు ఎమ్మెల్యేలను వెంట తేస్తే 75 కోట్ల రూపాయల వరకు ఇస్తామని చెప్పారని చీమా వెల్లడించారు. పంజాబ్‌లో ప్రభుత్వాన్ని కూల్చడానికి కేంద్రప్రభుత్వం 1,375 కోట్ల రూపాయలను పక్కన పెట్టిందని తెలిపారు. ఒక వేళ లొంగకపోతే సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తామని చెప్పారని చీమా భారతీయ జనతా పార్టీపై ఆరోపణల వర్షం కురిపించారు.