Tourist submerine: తప్పిపోయిన టైటానిక్ టూరిస్ట్ సబ్‌మెరైన్ : టూరిస్టుల్లో ఇద్దరు పాకిస్తానీలు
టైటానిక్ నౌక మునిగిన ప్రదేశంలో ఉన్న శిథిలాలను చూసేందుకు వెళ్లిన అయిదుగరు టూరిస్టులు మిస్సింగ్ అయిన విషయం తెలిసిందే. సబ్‌మెరైన్ లో ఉన్న అయిదుగురు టూరిస్టుల్లో ఇద్దరు పాకిస్థానీలు ఉన్నారు. పాక్ వ్యాపారవేత్త షహజాద్ దావూద్ తో పాటు ఆయన కుమారు సులేమాన్ ఉన్నారు.
Tourist submerine: టైటానిక్ నౌక మునిగిన ప్రదేశంలో ఉన్న శిథిలాలను చూసేందుకు వెళ్లిన అయిదుగరు టూరిస్టులు మిస్సింగ్ అయిన విషయం తెలిసిందే. సబ్‌మెరైన్ లో ఉన్న అయిదుగురు టూరిస్టుల్లో ఇద్దరు పాకిస్థానీలు ఉన్నారు. పాక్ వ్యాపారవేత్త షహజాద్ దావూద్ తో పాటు ఆయన కుమారు సులేమాన్ ఉన్నారు. పాక్‌లో అత్యంత సంపన్నమైన కుటుంబానికి చెందిన వ్యక్తి షహజాద్ దావూద్. ఎస్ఈటీఐ ఇన్స్టిట్యూట్లో ఆయన ట్రస్టీగా కూడా ఉన్నారు.
పాకిస్థానీలతో పాటు బ్రిటీష్ వ్యాపారవేత్త కూడా ఉన్నారు. 58 ఏళ్ల హమీష్ హార్డింగ్ .. యాక్షన్ ఏవియేషన్ సంస్థ చైర్మెన్. ఓషియన్గేట్ సీఈవో స్టాక్టన్ రష్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. ఓషియన్గేట్ కంపెనీయే ఈ మిషన్‌ను ఆర్గనైజ్ చేసింది. ఫ్రాన్స్‌కు చెందిన 73 ఏళ్ల అన్వేషకుడు పౌల్ హెన్రీ నర్జియోలెట్ కూడా ఉన్నారు. గల్లంతైన పాకిస్థానీలు బ్రిటీష్ పౌరులు అని తెలుస్తోంది.
మూడు రోజులకు సరిపడా ఆక్సిజన్ ..(Tourist submerine)
కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి 600 కిలోమీటర్ల దూరంలో టైటానికి శిథిలాల వద్ద ఈ ఘటన జరిగింది. టూరిస్టు సబ్‌మెరైన్ డైవ్ చేసిన గంటా 45 నిమిషాల తర్వాత దానితో లింక్ కట్ అయ్యింది. అయితే ఆ సబ్‌లో మూడు రోజులకు సరిపడా ఆక్సిజన్ ఉన్నట్లు తెలుస్తోంది. టైటాన్ సబ్మెర్సిబుల్ సుమారు 10,432 కిలోల బరువు ఉంటుంది. 6.7 మీటర్ల పొడుగు ఉంటుంది. 96 గంటల పాటు దాంట్లో అయిదుగురు ఉండవచ్చు. సబ్‌లో 8 రోజుల పర్యటనకు రెండున్నర లక్షల డాలర్లు వసూలు చేస్తున్నారు.