Rajasthan Govt: ప్రభుత్వ ఉద్యోగులుకు గుడ్ న్యూస్ చెప్పిన అశోక్ గెహ్లట్
ప్రభుత్వ ఉద్యోగలుకు రాజస్థాన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు పూర్తిగా పెన్షన్ అందించనున్నట్టు ప్రకటించింది.

Rajasthan Govt: ప్రభుత్వ ఉద్యోగలుకు రాజస్థాన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు పూర్తిగా పెన్షన్ అందించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు జైపూర్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ అధ్యక్షత జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్యాబినెట్ సమావేశంలో రాజస్థాన్ సివిల్ సర్వీస్ (పెన్షన్) నిబంధన 1996 సవరించే ప్రతిపాదనకు అనుమతి లభించింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగంలో 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు రిటైర్మెంట్ అనంతరం పూర్తి పెన్షన్ అర్హులు కానున్నారు.
మరో 10 శాతం అదనపు పెన్షన్(Rajasthan Govt)
ఈ సవరణకు ముందు క్వాలిఫైయింగ్ సర్వీస్ కాలం 28 ఏళ్లుగా ఉంది. అదే విధంగా 75 ఏళ్ల పెన్షనర్లు లేదా కుటుంబ పింఛనుదారులు మరో 10 శాతం అదనపు పెన్షన్ అలవెన్స్‌ను పొందుతారు. ఒక వేళ పింఛనుదారుడు మరణిస్తే, అతని లేదా ఆమె వివాహిత వికలాంగ కుమారుడు లేదా కుమార్తె నెలకు రూ. 12,500 వరకు కుటుంబ పెన్షన్ ప్రయోజనాన్ని పొందేందుకు అర్హులవుతారు. దీనికి సంబందించిన కొత్త సవరణ నోటిఫికేషన్ ఏప్రిల్ 1, 2023 నుంచి అమలులోకి వస్తుంది.
ఒక్క పెన్షన్ సర్వీసు తో పాటు పదోన్నతులు, ప్రత్యేక వేతనం మరియు హోదాకు సంబంధించిన అనేక నిర్ణయాలు తీసుకుంది. రాజస్థాన్ సివిల్ సర్వీసెస్ (రివైజ్డ్ పే) రూల్స్, 2017ను సవరించే మరో ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించింది.
ఇవి కూడా చదవండి:
- Anurag Thakur: రెజ్లర్ల ఆందోళన.. మరోసారి చర్చలకు ఆహ్వానించిన అనురాగ్ ఠాగూర్
- Adipurush pre Release: ‘ఆదిపురుష్’ సినిమా కాదు.. రామాయణం