Last Updated:

Adipurush pre Release: ‘ఆదిపురుష్‌’ సినిమా కాదు.. రామాయణం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. ఓం రౌత్ దర్వకత్వం వహించిన మైథలాజికల్ డ్రామా మూవీ ‘ఆది పురుష్’. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతిసనన్, కీలక పాత్రల్లో సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్న ఈ సినిమా జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుక జరుపుకుంది.

Adipurush pre Release: ‘ఆదిపురుష్‌’ సినిమా కాదు.. రామాయణం

Adipurush pre Release: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. ఓం రౌత్ దర్వకత్వం వహించిన మైథలాజికల్ డ్రామా మూవీ ‘ఆది పురుష్’. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతిసనన్, కీలక పాత్రల్లో సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్న ఈ సినిమా జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుక జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 

మీరిచ్చిన ధైర్యంతోనే – ప్రభాస్(Adipurush pre Release)

ఈ సందర్బంగా ప్రభాస్ మాట్లాడుతూ.. మెగా స్టార్ చిరంజీవి గారు చెప్పినట్టు ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం మేం అందరం చేసుకున్న అదృష్టమన్నారు. ‘ఆదిపురుష్‌’ సినిమా కాదు.. రామాయణం. సినిమా కార్యక్రమాలకు రానీ చినజీయర్ స్వామి వారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారని తెలిపారు. ‘7 నెలల క్రితం త్రీడీలో ట్రైలర్‌ విడుదల చేసినప్పుడు .. మీరిచ్చిన ధైర్యంతోనే టీమ్‌ మొత్తం ఇప్పటికీ నడుస్తోంది. ఓం రౌత్‌, టెక్నీషియన్లు 8 నెలలుగా యుద్ధం చేశారు.

సినిమా మొదలైనప్పటి నుంచి రామాయణంలో లానే కష్టాలు పడ్డాం. నిర్మాత భూషణ్‌ చాలా ఎమోషనల్‌గా ఈ సినిమాను తీసుకున్నారు. కృతీసనన్‌.. మన జానకి, ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో సీతమ్మ పాత్రకు తను సరైన ఎంపిక అని నిరూపించుకుంది. దేవ్ దత్త నాగే తో నటిస్తున్నప్పుడు ఆయన నిజంగానే హనుమంతుడులా అనిపించారు. అజయ్‌, అతుల్‌ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఓం రౌత్‌ నా హీరో. అభిమానులే నా బలం. ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేస్తాను. అవి మూడు కూడా రావొచ్చు. స్టేజీ మీద తక్కువ మాట్లాడి ఎక్కువ సినిమాలు చేస్తాను. పెళ్లి ఎప్పుడైనా.. తిరుపతిలోనే చేసుకుంటాను’ అని ప్రభాస్ చెప్పారు.

ఆ ప్రయత్నాన్నే ప్రభాస్ చేస్తున్నాడు- చినజీయర్ స్వామి

‘సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన మహనీయులు ఉండే ఇలాంటి కార్యక్రమాలకు మాలాంటి వాళ్లు రావడం ఇదే మొదటసారి. దానికి కారణం నిజమైన బాహుబలుడు రాముడు అని నిరూపించడానికే ఈ సినిమా వచ్చింది. ప్రతి ఒక్కరి గుండెల్లో రాముడు ఉన్నాడు. అలా ప్రభాస్ తనలోని రాముడిని తెరపైకి తీసుకొస్తున్నారు. మానవ జాతి మార్గాన్ని చూపిస్తున్న మహనీయడే శ్రీరాముడే. ఆయన గురించి ఎవరు ఏం చెప్పినా.. ఈ మట్టిపై నడిచి పావనం చేసిన ఆదర్శ పురుషుడు. చాలామంది రాముడిని దేవుడిగా కొలుస్తారు. కానీ, రామాయణంలోె దేవతలంతా వచ్చి రాముడిని సాక్షాత్తూ నారాయణుడివి.. సీతా దేవి శ్రీమహాలక్ష్మి అని చెప్పినా.. తాను మానవుడిగానే ఉండాలనుకున్నాడు. ఒక మనిషి మనిషిగా ఉండగలిగితే దేవతలు కూడా అతని వెంటన నడుస్తారు.

అలాంటి వ్యక్తికి ఈ సమాజం ఆలయాలు కట్టి పూజిస్తుంది. ఈ విషయాన్నే రామాయణం చూపించింది. రాముడంటే మంచి ఆచరణకు నిలువెత్తు రూపమని రాక్షసడైన మారీచుడే చెప్పాడు. రాముడిని మనుషులు, రుషులు, దేవతలు.. ఆఖరికి పశుపక్షాదులు, చెట్లు కూడా ప్రేమించాయి. చివరికి ముక్కూ చెవులు కోసిన సూర్పణఖ కూడా ప్రేమించింది. అందుకే ఆలయాలు నిర్మించి ఆరాధిస్తున్నాం. మనలోని రాముడిని తెచ్చే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నాన్నే ఇపుడు ప్రభాస్ చేస్తున్నాడు. ఇంతకంటే లోకానికి మహొపకారం ఉండదు. అలాంటి మంచి పనిచేసే మహనీయులకు ఆ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నా. ఇలాంటి సినిమా అందిస్తున్న దర్శకుడికి అభినందనలు. చిత్ర యూనిట్ కి నా దీవెనలతో పాటు ప్రేక్షకుల దీవెనలు కూడా కావాలి’ అని చినజీయర్ స్వామి అన్నారు.

 

అదృష్టంగా భావిస్తున్నా- కృతీ సనన్(Adipurush pre Release)

‘నటిగా నా కెరీర్‌ తెలుగులోనే మొదలైంది. మీ ఆశీస్సుల వల్లే తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ‘ఆదిపురుష్‌’తో మీ ముందుకు వస్తున్నా. జానకి పాత్ర నన్ను సెలెక్ట్ చేసినందుకు ఆనందంగా ఉంది. సీతమ్మ పాత్ర పోషించినందుకు డ కొంతమందికి మాత్రమే దక్కే అదృష్టం ఇది. ఆమె శక్తి మంతురాలు, ప్రేమ మూర్తి, భయమనేది ఎరుగదు. ప్రభాస్‌ నిజంగా డార్లింగ్‌, స్వీట్‌హార్ట్‌. ఆయన తక్కువ మాట్లాడతాడనేది నిజం కాదు. రాముడి పాత్రని.. ప్రభాస్‌ తప్ప ఎవరూ చేయలేరు. ఆయనలో స్వచ్ఛత ఉంది’ అని కృతీసనన్ తెలిపింది. ‘ఆదిపురుష్‌’ చిత్రం మనందరిదీ. ఇది ఇండియన్‌ సినిమా. భూషణ్‌కుమార్‌ వల్లే ‘ఆదిపురుష్‌’ తెరపైకి వచ్చింది. ప్రభాస్‌ లేకుండా ఈ చిత్రం లేదు. ఈ నెల 16న థియేటర్లలో కలుద్దాం.’ అని దర్శకుడు ఓం రౌత్ చెప్పారు.