Japanese interval walking: అద్భుతమైన ఆరోగ్యం కోసం జపనీస్ 30 నిమిషాల నడక.!

Japanese interval walking: అద్భుతమైన ఆరోగ్యం కోసం జపనీస్ 30 నిమిషాల నడక ఫాలోకావాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజూవారి శారీరక శ్రమ చేయడం వలన స్థిరమైన ఆరోగ్యం లభిస్తుంది. జపాన్ ప్రజలు ఇలాంటి 30నిమిషాలు నడక ఫాలో కావడం వలన అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందుతున్నారు. ఈ 30నిమిషాల నడక ఏరోబిక్స్, బిమ్ లాంటి అధికప్రాధాన్యత వ్యాయామాల కంటే ఎక్కువగా ఉపయోగపడుతుంది.
రోజూ 30నిమిషాలు నడక
ప్రతీరోజు 30నిమిషాలు నడవండి. ఇది అత్యంత అస్తవ్యస్తమైన షెడ్యూల్‌లో కూడా సరిపోయేలా ఉంటుంది. వ్యాయామం చేయడానికి తప్పనిసరి జిమ్ లాంటిది ఉండాల్సిన పనిలేదు. రోడ్డు ఉంటే సరిపోతుంది. ప్రతీరోజు నడవడం వలన గుండె సంబంధిత ఆరోగ్యాన్ని పెంచుతుంది. కండరాలను బలపరుస్తుంది. దీంతోపాటే బరువుకూడా సులభంగా తగ్గుతారు. నడక వ్యాయామానికి భిన్నంగా సులువుగా ఉంటుంది. ఏ వయసు వారైనా సులభంగా చేయవచ్చు. ఇందులో గాయపడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది.
ఆరుబయట, గ్రౌండ్ లో నడవడం వలన మానసికంగా, శారీరకంగా బలంగా తయారవుతారు. ముఖ్యంగా ఆరుబయట నడవటం వలన ఉనికి బయటకు అగుపడుతుంది. ప్రతీరోజు ఉదయం ప్రకృతిలో నడవడం వలన ప్రపంచాన్ని కొత్తగా చూసే అవకాశం ఉంటుంది. ఒత్తిడిని సులభంగా జయించవచ్చు. వయసును బట్టి 30నిమిషాల వ్యాయామాన్ని రెండు పార్టులుగా విభజించుకోవచ్చు. ముందుగా 15నిమిషాలు నడకసాగించి ఆతర్వాత కాస్త విశ్రాంతి తీసుకుని మరో 15నిమిషాల నడకను పూర్తి చేయవచ్చు.
జపాన్ వారి 30నిమిషాల నడక కేవలం వ్యాయామం రూపం కాదని అది మానసికంగానూ ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మానసిక ఉల్లాసాన్ని అనుభవిస్తూ 30నిమిషాల నడకను పూర్తి చేయాలి. ఇందులో శరీరం మాత్రమే కాకుండా మెదడును భాగం చేయాలి. ప్రకృతితో కలిసి నడవాలి అప్పుడే ఆరోగ్యం దరిచేరుతుంది.