GT vs MI: గిల్ విలయతాండవం.. ముంబయి లక్ష్యం 234 పరుగులు
GT vs MI: ఐపీఎల్ 2023లో భాగంగా క్వాలిఫయర్ 2లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది.
GT vs MI: గుజరాత్ భారీ స్కోర్ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన గుజరాత్.. 20 ఓవర్లలో 233 పరుగులు చేసింది. గిల్ సూపర్ సెంచరీ సాధించాడు. 60 బంతుల్లో 129 పరుగులు చేశారు. ఇందులో 10 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. ఇక సాయి సుదర్శన్ కూడా రాణించాడు. 31 బంతుల్లో 43 పరుగులు చేశాడు. చివర్లో హర్దీక్ సిక్సర్ తో ఇన్నింగ్స్ ను ముగించాడు.
ముంబయి బౌలర్లలో.. పియూష్ చావ్లా, మధ్వాల్ చెరో వికెట్ తీసుకున్నారు.
LIVE NEWS & UPDATES
-
GT vs MI: గిల్ విలయతాండవం.. ముంబయి లక్ష్యం 234 పరుగులు
గుజరాత్ భారీ స్కోర్ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన గుజరాత్.. 20 ఓవర్లలో 233 పరుగులు చేసింది. గిల్ సూపర్ సెంచరీ సాధించాడు. 60 బంతుల్లో 129 పరుగులు చేశారు. ఇందులో 10 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. ఇక సాయి సుదర్శన్ కూడా రాణించాడు. 31 బంతుల్లో 43 పరుగులు చేశాడు. చివర్లో హర్దీక్ సిక్సర్ తో ఇన్నింగ్స్ ను ముగించాడు.
ముంబయి బౌలర్లలో.. పియూష్ చావ్లా, మధ్వాల్ చెరో వికెట్ తీసుకున్నారు.
-
GT vs MI: గిల్ ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్
సూపర్ సెంచరీ చేసిన గిల్ ఔటయ్యాడు. దీంతో గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. గిల్ 60 బంతుల్లో 129 పరుగులు చేశాడు. ఇందులో 10 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి.
-
GT vs MI: గిల్ సూపర్ సెంచరీ.. ఈ సీజన్ లో మూడవది
గిల్ సూపర్ సిక్సర్లతో సెంచరీ సాధించాడు. 49 బంతుల్లో 100 పరుగులు చేశాడు.
-
GT vs MI: సిక్సుల వర్షం.. విరుచుకుపడుతున్న గిల్
గిల్ సూపర్ సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. 43 బంతుల్లో 85 పరుగులు చేశాడు.
-
GT vs MI: రెండు బంతులు.. రెండు సిక్సులు
ఆకాశ్ మధ్వాల్ వేసిన రెండు బంతులను రెండు సిక్సర్లుగా గిల్ మలిచాడు.
-
GT vs MI: గిల్ అర్దసెంచరీ.. రాణిస్తున్న సాయి సుదర్శన
గిల్ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు సాయి సుదర్శన్ నిలకడగా రాణిస్తున్నాడు.
-
GT vs MI: 8 ఓవర్లకు 64 పరుగులు
8 ఓవర్లు పూర్తయ్యేసరికి గుజరాత్ 64 పరుగులు చేసింది.
-
GT vs MI: తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. సాహా ఔట్
గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. పియుష్ చావ్లా బౌలింగ్ లో సాహా స్టంపౌట్ అయ్యాడు.
-
GT vs MI: ధాటిగా ఆడుతున్న గిల్.. పవర్ ప్లే లో 50 పరుగులు
గిల్ ధాటిగా అడుతుండటంతో.. గుజరాత్ పవర్ ప్లే లో 50 పరుగులు చేసింది.
-
GT vs MI: నిదానంగా బ్యాటింగ్.. నాలుగు ఓవర్లకు 27 పరుగులు
గుజరాత్ నిదానంగా బ్యాటింగ్ చేస్తోంది. నాలుగు ఓవర్లు ముగిసేసరికి 27 పరుగులు చేసింది.
-
GT vs MI: రెండో ఓవర్లో 10 పరుగులు
గ్రీన్ వేసిన రెండో ఓవర్లో 10 పరుగులు వచ్చాయి.
-
GT vs MI: తొలి ఓవర్.. కేవలం మూడు పరుగులే
జాసన్ బెహ్రెండోర్ఫ్ వేసిన తొలి ఓవర్లో మూడు పరుగులే వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో సాహా, గిల్ ఉన్నారు.
-
GT vs MI: గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ
-
GT vs MI: ముంబై ఇండియన్స్ తుది జట్టు
ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్
-
GT vs MI: టాస్ గెలిచిన ముంబయి
ఐపీఎల్ 2023లో భాగంగా క్వాలిఫయర్ 2లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.