Last Updated:

Akash Madhwal: సంచలన బౌలింగ్.. ఇంజినీర్ టూ క్రికెటర్ గా ఆకాశ్ మధ్వాల్ స్టోరీ!

Akash Madhwal: చాలామంది చిన్ననాటి నుంచే.. క్రికెటర్ కావాలని కోరుకుంటారు. దానికి తగినట్లుగానే కెరీర్‌గా స్వీకరిస్తారు. కానీ అకాశ్ మధ్వాల్ తొలుత ఇంజినీరింగ్ పూర్తి చేసి.. ఉద్యోగంలో స్ధిరపడ్డాడు.

Akash Madhwal: సంచలన బౌలింగ్.. ఇంజినీర్ టూ క్రికెటర్ గా ఆకాశ్ మధ్వాల్ స్టోరీ!

Akash Madhwal: ముంబయితో జరిగిన క్వాలిఫయర్ 2 లో లక్నో ఘోర ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో సంచలన బౌలింగ్ చేసిన ఆకాశ్ మధ్వాల్ గురించే ఇపుడు చర్చ నడుస్తోంది. ఎవరి ఆకాశ్ మధ్వాల్.. ఇంజినీర్ కాస్త క్రికెటర్ గా ఎలా మారాడు అనేదే చర్చనీయంశంగా మారింది. బుల్లెట్ల లాంటి బంతులతో.. లక్నో ఓటమిని శాసించిన బౌలర్ గురించి మరింత తెలుసుకుందాం.

ఇంజినీరింగ్ పూర్తి చేసి.. (Akash Madhwal)

ముంబయితో జరిగిన క్వాలిఫయర్ 2 లో లక్నో ఘోర ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో సంచలన బౌలింగ్ చేసిన ఆకాశ్ మధ్వాల్ గురించే ఇపుడు చర్చ నడుస్తోంది. ఎవరి ఆకాశ్ మధ్వాల్.. ఇంజినీర్ కాస్త క్రికెటర్ గా ఎలా మారాడు అనేదే చర్చనీయంశంగా మారింది. బుల్లెట్ల లాంటి బంతులతో.. లక్నో ఓటమిని శాసించిన బౌలర్ గురించి మరింత తెలుసుకుందాం.

చాలామంది చిన్ననాటి నుంచే.. క్రికెటర్ కావాలని కోరుకుంటారు. దానికి తగినట్లుగానే కెరీర్‌గా స్వీకరిస్తారు. కానీ అకాశ్ మధ్వాల్ తొలుత ఇంజినీరింగ్ పూర్తి చేసి.. ఉద్యోగంలో స్ధిరపడ్డాడు. ఆ తర్వాత క్రికెట్ లో అడుగుపెట్టాడు. ఐదేళ్ల క్రితం వరకు కేవలం.. టెన్నిస్ బంతితోనే క్రికెట్ ఆడాడు. ఉత్తరాఖండ్‌ నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోకి అడుగు పెట్టాడు.

జాఫర్‌ సాయంతో..

25 ఏళ్ల వయసులో.. ఆకాశ్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. 2019లో సయ్యద్ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఆరంగ్రేటం చేశాడు.

ఈ టోర్నీలో జాఫర్‌ చొరవ చూపి మద్దతుగా నిలవడంతో మధ్వాల్ తన సత్తా నిరూపించుకున్నాడు. ఇదే సమయంలో.. ముంబయి ఆకాశ్ కు అవకాశం ఇచ్చింది.

అలా కేవలం రూ. 20 లక్షలకు సొంతం చేసుకున్నప్పటికీ.. గత సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేకపోయాడు.

ఈ సీజన్ లో కూడా.. అర్చర్ గాయపడటంతో దీంతో ఈ సీజన్‌లోనే అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలను నమోదు చేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

పంత్‌ గురువు వద్దే..

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌కు ఆకాశ్‌ మధ్వాల్ సహచరుడే. ఇద్దరూ ఒకే ప్రాంతం నుంచి వచ్చారు.

అలాగే పంత్‌కు కోచింగ్‌ ఇచ్చిన అత్వార్‌ సింగ్ వద్దే ఆకాశ్‌ కూడా శిక్షణ తీసుకున్నాడు. దేశవాళీలో ఆకాశ్ ఆటతీరుకు అతడిని కెప్టెన్సీ వరించింది.

ఉత్తరాఖండ్‌ జట్టుకు సారథిగా నియమిస్తూ క్రికెట్ సంఘం నిర్ణయం తీసుకోవడం విశేషం.

ఆకాశ్‌లో స్పెషల్‌ అదే..

బంతిని తక్కువ బౌన్స్‌తో జారవిడిచేలా వేయడం ఆకాశ్ మధ్వాల్ ప్రత్యేకత.

లీగ్‌ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై నాలుగు వికెట్లు తీసిన ఆకాశ్.. ఈసారి మాత్రం మరింత కట్టుదిట్టంగా బంతులను సంధించాడు.

అత్యంత తక్కువ ఎకానమీతో బౌలింగ్‌ వేసిన బౌలర్‌గా మారాడు. లక్నో 3.3 ఓవర్లలో కేవలం ఐదు పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.

లక్నో బ్యాటర్‌ బదోనిని క్లీన్‌ బౌల్డ్‌ చేసిన తర్వాత బంతికే డేంజరస్‌ బ్యాటర్ నికోలస్‌ పూరన్‌ను బోల్తా కొట్టించాడు.

టెస్టుల్లో మాత్రమే చూసే లెంగ్త్‌తో బంతిని సంధించి వికెట్లు రాబట్టాడు.