Last Updated:

Mem Famous Movie Review : సుమంత్ ప్రభాస్ “మేమ్ ఫేమస్” తో హిట్ కొట్టినట్టేనా.. మూవీ రివ్యూ, రేటింగ్ ?

Mem Famous Movie Review : సుమంత్ ప్రభాస్ “మేమ్ ఫేమస్” తో హిట్ కొట్టినట్టేనా.. మూవీ రివ్యూ, రేటింగ్ ?

Cast & Crew

  • సుమంత్ ప్రభాస్ (Hero)
  • మణి ఏగుర్ల, మౌర్య చౌదరి (Heroine)
  • సార్య లక్ష్మణ్, సిరి రాసి, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, కిరణ్ మచ్చ, అంజిమామ, శివ నందన్ తదితరులు (Cast)
  • సుమంత్ ప్రభాస్ (Director)
  • అనురాగ్ రెడ్డి,శరత్ చంద్ర, చంద్రు మనోహర్ (Producer)
  • కళ్యాణ్ నాయక్ (Music)
  • శ్యామ్ దూపాటి (Cinematography)
2.3

Mem Famous Movie Review : యూట్యూబర్ సుమంత్ ప్రభాస్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన సినిమా “మేమ్  ఫేమస్”. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. తెలంగాణ నేటివిటీలో వస్తుండటంతో ముఖ్యంగా తెలంగాణలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాశి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక్ సంగీతం సమకూర్చగా.. చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్.. లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రు, మనోహరన్ సంయుక్తంగా నిర్మించారు. యూట్యూబ్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసి సినిమాల స్థాయికి వచ్చాడు ఈ యంగ్ హీరో. టాలెంట్ కి ఎంకరేజ్ మంచి ప్రొడక్షన్ హౌస్ కూడా దొరికింది. ప్రమోషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో అదరగొట్టారు. సాధారణంగా యూత్ అందరికీ ఇది కనెక్ట్ అయ్యే స్టోరీ అని ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. అదే విధంగా ‘మేజర్’, ‘రైటర్ పద్మభూషణ్’ తర్వాత ఛాయ్ బిస్కెట్ నుంచి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. మరి నేడు ( మే 26, 2023 ) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యూత్ కి కనెక్ట్ అయ్యిందా ? లేదా ?? అని మీకోసం ప్రత్యేకంగా ఈ రివ్యూ..

కథ.. 

మయి అలియాస్ మహేష్ (సుమంత్ ప్రభాస్), దుర్గ (మణి ఏగుర్ల), బాలి అలియాస్ బాలకృష్ణ (మౌర్య చౌదర్య) స్నేహితులు. ఈ ముగ్గురూ ఆవారాగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు చేసే పనులకు ఊరిలో జనాలు ఇబ్బంది పడుతూ ఉంటారు. పంచాయతీ ప్రెసిడెంట్ జింక వేణు (కిరణ్ మచ్చా), అంజి మామ (అంజి మామ మిల్కూరి) మాత్రం మద్దతు ఇస్తారు. ఊరి జనాల చేత ‘తూ’ అనిపించుకున్న మయి… ఫేమస్ ఎలా అయ్యాడు? మామ కూతురు మౌనిక (సార్య లక్ష్మణ్)తో అతడి ప్రేమ కథ ఏమిటి? అది ఏ తీరానికి చేరింది? మధ్యలో ఫేమస్ టెంట్ హౌస్, ఫేమస్ టీవీ యూట్యూబ్ ఛానల్ స్టోరీ ఏంటి? హీరో, అతని ఫ్రెండ్స్ చేసిన పనుల వల్ల ఊరి సమస్యలు ఎలా తీరాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి అంటే సినిమా చూడక తప్పదు.

Image

విశ్లేషణ (Mem Famous Movie Review).. 

ఈ సినిమాలో ముగ్గురు స్నేహితులు, ప్రారంభ సన్నివేశాల్లో ‘జాతి రత్నాలు’ కొంచెం గుర్తుకు వస్తుంది. అయితే ఆ సినిమా కంపేరిజన్ పక్కన పెట్టి, కేవలం ఈ మూవీ విషయానికి వస్తే.. ఇందులో యూత్ ఫుల్ కామెడీ ఉంది. లిప్‌స్టిక్ స్పాయిలర్ క్యారెక్టర్ సీన్స్.. ఫ్రెండ్స్ మధ్యలో ఎమోషనల్ సీన్స్ బావున్నాయి. బావపై మరదలు ప్రేమను వ్యక్తం చేసే సన్నివేశం ఆకట్టుకుంటుంది. అయితే కథలో కొంచెం డెప్త్ మిస్ అయ్యింది. సందేశం ఇవ్వడానికి, బలవంతంగా భావోద్వేగాలను కథలో ఇరికించడానికి చేసిన ప్రయత్నంలా ఉంది. కామెడీని, ఎమోషన్స్ ని బ్యాలన్స్ చేయడంలో దర్శకుడిగా సుమంత్ ఎక్కడో తడబడ్డాడు. మూవీలో కొన్ని సీన్స్ యూట్యూబ్ లో చూసిన సన్నివేశాలకు పేరడీలా ఉన్నాయి. కథలో కొత్తదనం లేకపోయినా తెలంగాణ నేపథ్యంలో సీసా తీసుకుని పాత సరుకుతో నింపేశారు.

ఎవరెలా చేశారంటే.. 

హీరోగా సుమంత్ ప్రభాస్ బాగా నటించాడు. అతని స్నేహితులుగా మణి, మౌర్య కూడా మెప్పించారు. రెగ్యులర్ హీరోయిన్స్ లా కాకుండా పక్కింటి అమ్మాయిలా సార్య కనిపించారు. యూట్యూబర్ సిరికి స్క్రీన్ స్పేస్ ఉన్న క్యారెక్టర్ లభించింది. అంజి మామ, కిరణ్ మచ్చా, ‘డీజే టిల్లు’ ఫేమ్ మురళీధర్ గౌడ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. లిప్‌స్టిక్ స్పాయిలర్ పాత్రలో నటించిన శివ నందన్ కామెడీ టైమింగ్ బావుంది. కొన్ని అనవసరమైన సన్నివేశాలకు తీసేస్తే ఇంకా బావుండేది. నేపథ్య సంగీతంతో కళ్యాణ్ నాయక్ ఆకట్టుకున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

కంక్లూజన్.. 

అనుకున్నంత కాకపోయినా ప్రయత్నం బాగుంది..

ఇవి కూడా చదవండి: