2018 Movie : ఆస్కార్ బరిలో మలయాళ మూవీ “2018”.. భారత్ నుంచి అధికారిక ఎంట్రీ
కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన మలయాళ సినిమా 2018. జూడే ఆంథోని జోసెఫ్ దర్శకత్వంలో టోవినో థామస్, కుంచకో బోబన్, అసిఫ్ ఆలీ, లాల్ తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మలయాళంలో సంచలనాలు సృష్టించింది ఈ సినిమా. మామూలు సినిమాగా మొదలై.. 100 కోట్ల క్లబ్ లో చేరింది.
2018 Movie : కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన మలయాళ సినిమా 2018. జూడే ఆంథోని జోసెఫ్ దర్శకత్వంలో టోవినో థామస్, కుంచకో బోబన్, అసిఫ్ ఆలీ, లాల్ తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మలయాళంలో సంచలనాలు సృష్టించింది ఈ సినిమా. మామూలు సినిమాగా మొదలై.. 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇటీవల తెలుగులోకి విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్ కు నామినేట్ అవ్వడం గమనార్హం.
చెన్నై వేదికగా ఆస్కార్ ఎంట్రీ కోసం ఆస్కార్ కమిటీ దరఖాస్తులు స్వీకరించింది. కాసరవల్లి గిరీష్ అధ్యక్షతన 17 మంది సభ్యులతో కమిటీ దరఖాస్తులను స్వీకరించింది. మొత్తం 22 సినిమాలను కమిటీ చూసింది. ఫైనల్ గా అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 2018 మలయాళం (2018 Movie) ఫిల్మ్ ను ఎంపిక చేసింది. ఇక గతేడాది ఇండియాకు రెండు విభాగాల్లో ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ – ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ సాంగ్ ‘నాటు నాటు’కు అవార్డు దక్కింది.
ఇక ఇటీవలే నెదర్లాండ్స్ లో అందించే సెప్టిమిస్ అవార్డ్స్‌కి.. బెస్ట్ ఆసియన్ యాక్టర్ నామినేషన్స్ లో టోవినో థామస్, బెస్ట్ ఆసియన్ ఫిలిమ్ క్యాటగిరిలో 2018 సినిమా నామినేట్ అయ్యాయి. ఇక ఈ పురస్కారంలో టోవినో థామస్ బెస్ట్ యాక్టర్ గా ఈ ఇంటర్నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్నాడు.
😍🤩🙏🏼❤️ #2018Movie – India’s Official entry to Oscars! pic.twitter.com/WTnBfWRhPv
— Tovino Thomas (@ttovino) September 27, 2023
ఆర్మీలో ఉద్యోగం మానేసి దుబాయ్ వెళ్లే ప్రయత్నాల్లో ఉంటాడు టోవినో థామస్. మత్య్సకార కుటుంబానికి చెందిన అసిఫ్ అలీ.. ఓ పెద్ద మోడల్ కావడమే లక్ష్యంగా కష్టపడుతుంటాడు. టూరిస్ట్‌లకి తలలో నాలుకలా ఉంటూ కుటుంబాన్ని పోషించే టాక్సీ డ్రైవర్ అజు వర్ఘీస్.. కేరళ బోర్డర్ లో ఉండే తమిళనాడు గ్రామానికి చెందిన ఓ లారీ డ్రైవర్ కలైయారసన్. ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే కుంచకో బొబన్ .. ఇలా ఎవరి జీవితాలు వారివి, ఎవరి పనులతో వాళ్లు సతమతమవుతూ ఉంటారు. కానీ కొన్ని రోజుల వ్యవధిలోనే వాళ్ల జీవితాలు అనూహ్యమైన ఆటుపోట్లకి గురవుతాయి. అది ఎవరూ ఊహించరు. భారీ వర్షాలతో కేరళ ని వరదలు ముంచెత్తుతాయి. దీంతో ఎవరి జీవితాలు ఎలా మారాయి? ప్రాణాలు నిలుపుకొంటే చాలు అనుకునే పరిస్థితుల్లో ఒకరి కోసం మరొకరు ఎలా నిలబడ్డారు అనేది సినిమా లో చూడాల్సిందే.