Monkeypox Case: కేరళలో మొట్టమొదటి మంకీఫాక్స్ కేసు
ఓ వైపు కరోనాతో సతమతమవుతున్న ప్రజలపై వైరస్లు దండయాత్ర మొదలుపెట్టాయి. ఇప్పటికే కరోనాతో పాటు జికా వైరస్లు దేశంలో వ్యాప్తి చెందుతుండగా.. ఇప్పుడు దానికి మంకీపాక్స్ తోడైంది. ఈ మహమ్మారి తొలికేసు కేరళలో నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ వెల్లడించారు. ఈ నెల 12న యూఏఈ నుంచి తిరువనంతపురానికి వచ్చిన కొల్లాంకు చెందిన
Kerala: ఓ వైపు కరోనాతో సతమతమవుతున్న ప్రజలపై వైరస్లు దండయాత్ర మొదలుపెట్టాయి. ఇప్పటికే కరోనాతో పాటు జికా వైరస్లు దేశంలో వ్యాప్తి చెందుతుండగా.. ఇప్పుడు దానికి మంకీపాక్స్ తోడైంది. ఈ మహమ్మారి తొలికేసు కేరళలో నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ వెల్లడించారు. ఈ నెల 12న యూఏఈ నుంచి తిరువనంతపురానికి వచ్చిన కొల్లాంకు చెందిన వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయినట్లు తెలిపారు వీణాజార్జ్.
సదరు వ్యక్తికి లక్షణాలు కనిపించడంతో నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా, పాజిటివ్‌గా తేలిందని వీణాజార్జ్ పేర్కొన్నారు. అయితే దేశంలో తాజాగా నమోదవుతున్న మంకీ ఫాక్స్ కేసుల పట్ల అప్రమత్తమైంది కేంద్ర ఆరోగ్య శాఖ. మంకీ పాక్స్ వ్యాధి నివారణ కోసం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.
తాజాగా కేరళలో మంకీఫాక్స్ కేసు నమోదుతో అంతర్జాతీయ ప్రయాణికులు అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో కలవకూడదని సూచించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఇతరులకు దూరంగా ఉండాలని, జ్వరంతోపాటు ,చర్మ దద్దుర్లు లక్షణాలు ఉన్నవారు వెంటనే హాస్పిటల్ లో వైద్యులను సంప్రదించాలి సూచించింది.